Hair Tips : 90 సంవత్సరాల బామ్మ అనుభవంతో చెప్పిన సీక్రెట్ ఒకసారి రాస్తే చాలు…!!
Hair Tips : జుట్టు పెరగకుండా ఉండే వాళ్ళకి అలాగే హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉన్నవాళ్లకి పొడవుగా జుట్టు పెంచుకోవాలనుకున్న లేదా జుట్టు సిల్కీగా చేసుకోవాలన్న ఈ హోమ్ రెమిడి అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ ఇంగ్రిడియంట్స్ తో తయారు చేసుకుని అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమిడీ కాబట్టి దీనిని ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. యువతలో చాలామందికి 20 ఏళ్ల వయసు నుంచి జుట్టు రాలడం అధికమైంది. కొంతమంది టీనేజర్లు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా జుట్టు రాలడానికి కారణం వృద్ధాప్యంతో వచ్చే ఆండ్రోజెనిక్ అలోపేసి అని పిలిచే వంశపారంపర్య సమస్య ఇది కాకుండా వెంట్రుకలు పల్చబడడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. మితిమీరిన హెయిర్ కేర్ విధానాలు తలలో ఇన్ఫెక్షన్ కొన్ని
మందులు లేదా హార్మోన్ల మార్పు జుట్టుకి రసాయన చికిత్సలు ఎక్కువగా చేయించుకోవడం కూడా కారణంగానే చెప్పొచ్చు. కాబట్టి వెంట్రుకలు ఊడిపోవడం వల్ల ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారు వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఎంతో అనుభవజ్ఞులు చెప్పిన రెమిడి కాబట్టి ఇది చిన్న పిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు అందరూ వాడొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కాబట్టి చక్కగా ఇది తయారు చేసుకోండి. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని మందార ఆకులను తీసుకోవాలి. అలాగే కొన్ని మందార పూలు కూడా కావాలి. మందారంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది తలలోనే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సభలో నివారిస్తుంది చర్మ రంధ్రాలకు రక్షణ కల్పించి జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. ఇప్పుడు ఒక గుప్పెడు వరకు మందారాకులను
తీసుకుని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్ లో వేయండి. అలాగే ఒక ఐదు నుంచి 6 లేదా మీ తలకి ఎన్ని సరిపోతాయి అన్ని మందార పూలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. వండిన అన్నాన్ని తీసుకుంటున్నాం. ఇది కూడా ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు వండిన అన్నాన్ని తీసుకోండి. మీరు ఏ రైస్ వాడిన పర్వాలేదు ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు నీళ్లు వేసి ఈ మూడింటిని మెత్తగా బాగా గ్రైండ్ చేసేయండి. మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ని మరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి కట్ చేసి వేసేయండి. ఇప్పుడు అన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఆ తర్వాత ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీరు రాసిన మొదటిసారి మీ హెయిర్ గట్టి పడటం మీకు తెలుస్తుంది. మీ హెయిర్ ఆరోగ్యంగా బాగుంటుంది.