Hair Tips : ఈ చిట్కాతో… మీ ఊడిన జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది…
Hair Tips : ఈ రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఒకటి బాగా బాధపెడుతుంది. మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం వలన, తినే ఆహారంలో పోషకాలు లోపించడం వలన ఇలా కొన్ని కారణాల వలన జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఇలా జుట్టు రాలడంతో రాలిన ప్రదేశంలో కొత్త జుట్టు రాకపోవడం వలన జుట్టు పలచగా ఉంటుంది. దీనికోసం ఎన్ని హెయిర్ ఆయిల్స్ ను ఉపయోగించిన ఫలితం ఉండదు. అందుకనే మీకు చెప్పబోయే ఈ చిట్కాతో మీ జుట్టు రాలిన ప్లేసులో కొత్త జుట్టు త్వరగా వస్తుంది. అంతేగాకుండా జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ఈ చిట్కాను మన ఇంట్లో లభించే పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. అయితే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కా వలన మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక ప్రతి ఒక్కరు దీనిని ఉపయోగించవచ్చు. ఈ చిట్కాను చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సింది అలోవెరా యొక్క కాండం. కలబందను జుట్టు కు ఉపయోగించడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు చాలా స్మూత్ గా మరియు సిల్కీగా ఉంటుంది. ఈ కలబందను ముఖానికి కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు అలోవెరాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకును ఐదు, ఆరు రెమ్మల దాకా నీటితో శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కరివేపాకు లో విటమిన్ కె ఉంటుంది. ఇది జుట్టును దృఢంగా, నల్లగా ఉంచుతుంది. కరివేపాకు మనకు సులువుగా అందరి ఇంట్లో దొరుకుతుంది.
తర్వాత కలోంజీ విత్తనాలను ఒక స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ సిరంను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మన జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల దాకా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అరగంటసేపు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలజుట్టు స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం ద్వారా ఊడిపోయిన జుట్టు పెరుగుతుంది. అలాగే ఒత్తుగా, దృఢంగా ఉంటుంది.దీనిని పొడి జుట్టు లేదా ఆయిల్ జుట్టు పైన కూడా రాసుకోవచ్చు.