Hair Tips : ఇలా చేశారంటే… అందరు మీ జుట్టును చూసి వారెవ్వా అంటారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : ఇలా చేశారంటే… అందరు మీ జుట్టును చూసి వారెవ్వా అంటారు…

Hair Tips : ప్రస్తుతం చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. దీనికి కారణం పండుగలని, ఫంక్షన్లని అందరూ జుట్టును స్ట్రైట్నింగ్ కోసం రకరకాల ఎలక్ట్రిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారు. వాటి వలన జుట్టు డ్యామేజ్ అవుతుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది. అందుకే ఎటువంటి క్రీములు ఎటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగించకుండా పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేకుండా సులువుగా ఇంట్లోనే మీ జుట్టును స్టైల్ గా చేసుకోవచ్చు. ఈ చిట్కాను ఉపయోగించడం వలన […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 September 2022,3:00 pm

Hair Tips : ప్రస్తుతం చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. దీనికి కారణం పండుగలని, ఫంక్షన్లని అందరూ జుట్టును స్ట్రైట్నింగ్ కోసం రకరకాల ఎలక్ట్రిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారు. వాటి వలన జుట్టు డ్యామేజ్ అవుతుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది. అందుకే ఎటువంటి క్రీములు ఎటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగించకుండా పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేకుండా సులువుగా ఇంట్లోనే మీ జుట్టును స్టైల్ గా చేసుకోవచ్చు. ఈ చిట్కాను ఉపయోగించడం వలన మీ జుట్టు స్ట్రైట్ గా అవ్వడమే కాకుండా సిల్కీగా తయారవుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. దీనిలో 4 చెంచాల అవిస గింజలు వేసి పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి.

తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఒక గుడ్డ తీసుకొని వడకట్టుకొని జెల్ సపరేట్ చేసుకోవాలి. ఒక కప్పు అవిసె గింజలను ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకోవాలి. దీనిలో ఒక కప్పు అలోవెరా జెల్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవిసె గింజల జెల్ వద్దు అనుకున్న వాళ్లు అరటిపండును ఉపయోగించాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుర్ల నుంచి చివర్ల దాకా పాయలు పాయలుగా విడదీసి రాసుకోవాలి. రాసిన తర్వాత జుట్టు ముడి పెట్టకూడదు. ఫ్రీగా వదిలేయాలి. ఆరిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత మీ జుట్టు చాలా మృదువుగా తయారవుతుంది.

Hair Tips for straight hair with Straightening machine In Telugu

Hair Tips for straight hair with Straightening machine In Telugu

ఈ చిట్కా వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అన్నం జుట్టును బలంగా చేయడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు జుట్టు రాలడం తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అలోవెరా జెల్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు స్మూత్ గా సిల్కీగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు స్ట్రైట్ గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ ను ఉపయోగించడం వలన ఎటువంటి ఎలక్ట్రికల్ హెయిర్ స్ట్రైట్నింగ్ మిషన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సులువుగా ఇంట్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిట్కాను తయారు చేసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది