Hair Tips : ఏం చేసినా జుట్టు రాలడం ఆగట్లేదా..? అయితే ఇదొక్కటి ట్రై చేయండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : ఏం చేసినా జుట్టు రాలడం ఆగట్లేదా..? అయితే ఇదొక్కటి ట్రై చేయండి

 Authored By pavan | The Telugu News | Updated on :29 March 2022,2:00 pm

Hair Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం చాలా పెద్ద సమస్యగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. టీనేజీ పిల్లల్లలోనూ జుట్టు రాలడం వారిని ఒత్తిడికి గురి చేస్తుంది. జుట్టు రాలడం ఆరోగ్య సమస్యగానే కాకుండా మానసిక సమస్యగా మారింది. చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు రకరకాల షాంపూలు, నూనెలు చాలా వాడి వాడి విసిగిపోయి ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఒక సారి ట్రై చేయండి.
ఈ చిట్కా జుట్టును రాలకుండా ఆపడంతో పాటు చుండ్రు సమస్యను పరిష్కరిస్తుంది. జుట్టు బలంగా నిగ నిగలాగే జుట్టు సొంతం అవుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. జుట్టు రాలడం, చుండ్రు, తల దురద పెట్టడం, జుట్టు ఎదగకపోవడం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

ఇంట్లోనే తయారు చేసుకుని జుట్టుకు పెట్టుకుంటే జుట్టును పొడవుగా ఒత్తుగా పెరిగే లాగా చేసుకోవచ్చు.దీని కోసం కావలసినవి పెరుగు, అలోవెరా జెల్, శీకాకాయ పొడి. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. పెరుగు.. స్కాల్ప్‌పై ఉండే ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. ఒక చెంచా శీకాకాయ పొడి వేసుకోవాలి. చింతకాయ గురించి దాని ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న అద్భుతమైన కాయ. ఇది జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ కూడా చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది.

Hair Tips growth home remedy

Hair Tips growth home remedy

అలాగే మాడుపై ఉండే ఇన్ఫెక్షన్‌ను పోగొడుతుంది. పెరుగు, శీకాకాయ పొడి, అలోవెరా జెన్‌ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత జుట్టును నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే ప్రయోజనం కనిపిస్తుంది. జుట్టు నిగనిగ లాడుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతుంది. తలస్నానం చేసిన తర్వాత ఎలాంటి కండిషనర్లు వాడాల్సిన అవసరం లేదు. ఈ ఈజీ చిట్కాతో చుండ్రు తగ్గించుకోవడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగ్గా పెరుగుతుంది. ఈ చిట్కాతో మరో ప్రయోజనం ఏమిటంటే.. దీనిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది