Hair Tips : మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే…మెంతులలో ఈ రెండు కలిపి రాయండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే…మెంతులలో ఈ రెండు కలిపి రాయండి…

Hair Tips : ఇప్పుడు చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీనికి కారణం మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం. అలాగే మనం తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పుల వలన కూడా జుట్టు సమస్యలు ఎక్కువగా బాధపెడుతున్నాయి. జుట్టు పెరగడం కోసమని కొందరు పార్లర్ కి వెళ్లి వివిధ రకాల ట్రీట్మెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. వేల వేల డబ్బులను వృధా చేస్తూ ఉంటారు. అయినా జుట్టు పెరగడంలో ఎటువంటి మార్పు రాదు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 July 2022,3:00 pm

Hair Tips : ఇప్పుడు చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీనికి కారణం మన దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం. అలాగే మనం తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పుల వలన కూడా జుట్టు సమస్యలు ఎక్కువగా బాధపెడుతున్నాయి. జుట్టు పెరగడం కోసమని కొందరు పార్లర్ కి వెళ్లి వివిధ రకాల ట్రీట్మెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. వేల వేల డబ్బులను వృధా చేస్తూ ఉంటారు. అయినా జుట్టు పెరగడంలో ఎటువంటి మార్పు రాదు. అయితే వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక నాచురల్ పద్ధతిలో జుట్టును పెరిగేలా చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది అయితే కొన్ని చిట్కాలను పాటించడం వలన జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. దానికోసం మనం ఒక హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా మనం జుట్టుకు సరిపడా మెంతులను రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి. తర్వాతి రోజు ఉదయాన్నే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు మందార పువ్వుల రెక్కలు విడదీసి వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన నాలుగు లేదా ఐదు మందార ఆకులను వేసుకోవాలి. ఈ ప్యాక్ కోసం కలబంద గుజ్జును రెండు లేదా మూడు స్పూన్లు వేయాలి. తర్వాత అందులోకి మెంతులను, మిగిలిన మెంతుల నీళ్లను కొన్ని పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులోకి రెండు స్పూన్ల కొబ్బరి నూనె లేదా క్యాస్టర్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి.

Hair Tips how to grow hair thick and long

Hair Tips how to grow hair thick and long

ఈ మిశ్రమాన్ని జుట్టు పొడిగా ఉన్నప్పుడు లేదా ఆయిల్ ఉన్న జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుర్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసి జుట్టును ముడిలాగా పెట్టుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాలు ఉండాలి. తర్వాత మీరు రోజు వాడే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. డెలివరీ అయిన తర్వాత చాలామందికి జుట్టు రాలడం సమస్య ఎక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. సైనస్ సమస్యతో బాధపడేవారు ఈ ప్యాక్ ను పదినిమిషాలు వేసుకోవాలి. ఎందుకంటే మెంతులు అనేవి చలవ కాబట్టి. జలుబు,తుమ్ములు ఉన్నవారు ఈ ప్యాక్ ను వేసుకోకుండా ఉండడమే మంచిది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది