Hair Tips : ఈ పువ్వులు నూనెలో ఉడికించి నిత్యం అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది..!!
Hair Tips : ప్రస్తుతం చాలామంది లో జుట్టు రాలే సమస్య రోజు రోజుకి ఎక్కువవుతుంది. ఈ సమస్యకి ఎన్నో కెమికల్స్ ఉన్న షాంపూలు, ఆయిల్స్ ను వాడుతూ ఉంటారు. అయితే వీటి వలన ఎటువంటి ఫలితం ఉండడం లేదు.. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మందార పువ్వులు ఈ ఆయిల్ లో ఉడికించి నిత్యం వాడినట్లయితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ మందారలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కుంకుమపువ్వు ఆయుర్వేద వైద్యంలో జుట్టు సంబంధిత సమస్యలకు ఉపయోగపడే ముఖ్యస్థానం ఉంది .మందార పూలరేకులు అలాగే ఆకులు జుట్టు సమస్యలకు చుండ్రుకు ఇంకా ఎన్నో సమస్యలకి గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. మందార పువ్వు ఈ సమస్యకి మంచి ఫలితాలను అందిస్తుంది. మందార పువ్వును వినియోగించడానికి గల కారణాలు మీకే అర్థమవుతుంది.
అయితే వాటిని ఎలా వినియోగించాలో చూద్దాం.. ఐదు సులభమైన అలాగే ప్రభావంతమైన చిట్కాలు చూపించబోతున్నాం.. ఈ పద్ధతుల కోసం మీరు మందార రేకులను అలాగే ఆకులను వినియోగించి ఇంట్లోనే జుట్టు సంరక్షణ కోసం దీనిని తయారు చేసుకోవచ్చు.. మందార నూనె : జుట్టు ఎదుగుదలకు ఆయిల్ మసాజ్ చాలా ప్రధానం. మందార నూనెలో ఆరోగ్యకరమైన జుట్టు ఎదుగుదలకు కావలసిన పోషకాలు ఉంటాయి. ఈ ఆయిల్ ను వాడి వారానికి రెండుసార్లు జుట్టుకి మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ ను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ముందుగా 10 మందార పువ్వులను 10 మందార ఆకులను తీసుకోవాలి. వీటిని శుభ్రం చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. తర్వాత స్టౌ పై పాన్ పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ పోసి వేడి కాగానే రుబ్బిన పేస్ట్ ని వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మూడు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇప్పుడు మందార నూనె రెడీ అవుతుంది. ఈ నూనె వినియోగించి తలకి అప్లై చేసి 30 నిమిషాలు పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా గాఢ తక్కువ షాంపుతో తలస్నానం చేయాలి. ఈ నూనెను గాజు సీసాలో స్టోర్ చేసుకొని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేస్తూ ఉండాలి. మందార అలాగే కొబ్బరి పాలు : జుట్టు చేర్చడం అనేది అనారోగ్యకరమైన అలాగే పొడి జుట్టు యొక్క అభివ్యక్తి. మందార అలాగే కొబ్బరి రెండు సహజ కండిషనర్లు.. మందార పూలరేకులను పిండి కొబ్బరి పాలలో కలపాలి. అలాగే అలోవెరా జెల్, తేనె, పెరుగు పేస్టులు కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టుకి అప్లై చేసి 30 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత గాడత తక్కువ గల షాంపుతో తల స్నానం చేయాలి. మందార జుట్టు ప్యాక్ : జుట్టు సమస్యలు అతి పెద్ద సమస్య బట్టతల.
దీనికి ఆయుర్వేద సరియైన పరిష్కారం ఎరుపు మందారం… దీనికోసం ఐదు మందార పువ్వులు అలాగే మందార ఆకులు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలపై ప్రభావిత ప్రాంతం పై అప్లై చేయాలి. తర్వాత మూడు గంటల పాటు అలాగే వదిలేయాలి.తర్వాత మందార షాంపు వినియోగించి జుట్టుని కడగాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.. మందార షాంపు : మందారంలో ఫోమింగ్ గుణాలు ఉన్నాయి. ఇది షాంపూలు వినియోగించడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మందార పువ్వు అలాగే మందర ఆకులు సమానంగా తీసుకొని ఒక పాత్రలో నీళ్లు పోసి దానిలో మందార పువ్వులు ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. తర్వాత దీనిని తలకి షాంపూ లాగా వినియోగించాలి..