Hair Tips : కేవలం రెండు రూపాయలతో… తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా…

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,5:00 pm

Hair Tips : ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వీటిని దాచిపెట్టడం కోసం రకరకాల కెమికల్స్ ఉండే రంగులను ఉపయోగిస్తున్నారు. పార్లర్ చుట్టూ తిరిగి వేల వేల డబ్బులను వృధా చేస్తున్నారు. దీనివల్ల అప్పటికప్పుడు జుట్టు నల్లగా అవుతుంది. కానీ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం రెండు రూపాయలతో ఈ చిట్కాను తయారు చేసుకోవడం వలన జుట్టు నల్లగా అవుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న ప్యాకెట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవారు రెండు ప్యాకెట్లు వేసుకోవాలి.

తర్వాత దీనిలో నాలుగు లేదా ఐదు చుక్కల రోజువారి కొబ్బరి నూనె వేసుకోవాలి. అందులో అర స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ కాకుండా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మూడింటిని బాగా కలిపి తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్న ఏరియాలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత జుట్టు గట్టిగా ముడి పెట్టుకోవాలి. ఒక గంట పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో ఎటువంటి షాంపూ లేకుండా శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు రోజులు చేయడం వలన తెల్ల వెంట్రుకలు పోయి జుట్టు నల్లగా అవుతుంది.

Hair Tips these remedy for white hair removal

Hair Tips these remedy for white hair removal

ఈ హెయిర్ డ్రై ఉపయోగించినప్పుడు ఆయిల్ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ డ్రై ని అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అలాగే ఎటువంటి హెన్నా, హెయిర్ ప్యాక్స్ లేకుండా తక్కువ సమయంలో అయిపోతుంది. కేవలం రెండు రూపాయలతో తక్కువ సమయంలో మీ జుట్టును నల్లగా చేసుకోవచ్చు. ఈ చిట్కా ఉపయోగించడం వలన ఎటువంటి నష్టం పెరగదు. అందుకనే అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి