Hair Tips : కర్లీ హెయిర్ ను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : కర్లీ హెయిర్ ను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా…?

Hair Tips : కర్లీ హెయిర్ ను సాధారణ జుట్టు లా కాకుండా కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉంగరాల జుట్టుకు తేమ ఎక్కువ ఉండదు. ఈజీగా ఎండిపోతుంది. అందుకే కర్లీ హెయిర్ ను మెయింటైన్ చేయడం కొంత కష్టం. అయితే కర్లీ హెయిర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఉంగరాల జుట్టు ఎప్పుడూ తేమ ఉండేలా చూసే ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి మరియు జుట్టు పొడిబారడం లేదా జుట్టు బరువు తగ్గేలా […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,3:00 pm

Hair Tips : కర్లీ హెయిర్ ను సాధారణ జుట్టు లా కాకుండా కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉంగరాల జుట్టుకు తేమ ఎక్కువ ఉండదు. ఈజీగా ఎండిపోతుంది. అందుకే కర్లీ హెయిర్ ను మెయింటైన్ చేయడం కొంత కష్టం. అయితే కర్లీ హెయిర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఉంగరాల జుట్టు ఎప్పుడూ తేమ ఉండేలా చూసే ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి మరియు జుట్టు పొడిబారడం లేదా జుట్టు బరువు తగ్గేలా చేసే ఏదైనా జుట్టు ఉత్పత్తిని నివారించాలి. కర్లీ హెయిర్ కోసం ప్రత్యేక షాంపు కండిషనర్ ఎంచుకోవాలి. కొబ్బరి నూనె, పొద్దుతిరుగుడు నూనె మరియు అవకాడో నూనె వంటి ముఖ్యమైన నూనెలను వాడాలి. జుట్టుగా జిడ్డుగా లేదా మురికిగా ఉంటే ప్రతి ఒకటి లేదా రెండు వారాలకి బలమైన క్లారిఫైయింగ్ షాంపును ఉపయోగించాలి.

జుట్టు ఎల్లప్పుడు తేమగా ఉండేందుకు కండిషనర్ తో షాంపూ చేయడానికి అలవాటు చేసుకోవాలి. వేడినీళ్లతో తలస్నానం చేయకూడదు. చల్లటి నీళ్లతో చేయడం వలన జుట్టు తేమగా, బలంగా ఉంటుంది. కర్లీ హెయిర్ ఉన్నవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. అలా చేయడం వలన జుట్టుకు అవసరం అయ్యే సహజ నూనెలు తొలగిపోతాయి. ఉంగరాల జుట్టు తరచుగా పొడిగా మరియు పెళుసుగా మారుతుంది. దువ్వినప్పుడు జుట్టు సులువుగా చిట్లిపోతుంది. అలా చిట్లిపోకుండా ఉండేందుకు షవర్ చేస్తున్నప్పుడే దువ్వుకోవాలి. దువ్వెనని ఎంచుకున్నప్పుడు ప్లాస్టిక్ బదులుగా సహజమైన ముళ్ళతో కూడిన అధిక నాణ్యత గల దువ్వెనను వాడాలి.

Hair tips for curly hair in telugu

Hair tips for curly hair in telugu

ఉంగరాల జుట్టు ఉంటే దానిని అలాగే వదులుగా వదిలేయమని చాలామంది అంటుంటారు. ఎందుకంటే బ్లో డ్రైయర్ని ఉపయోగించడం వలన అది చిట్లి పోయి దెబ్బతింటుంది. దువ్వెన చేసేటప్పుడు లాగడం మరియు వంగడం నివారించేందుకు డిటాంగ్లర్ ను ఉపయోగించాలి. కర్లీ హెయిర్ ను గట్టి పోనిటేయిల్స్ లేదా బన్స్ లా పెట్టకుండా ప్రయత్నించాలి. విశాలమైన దంతాల దువ్వెనను ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి. హీట్ టూల్స్ ని దూరంగా ఉంచాలి. కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు పడుకునే ముందు కొన్ని సహజ నూనెలను జోడించడం మంచిది. కొబ్బరినూనె, ఆలీవ్ నూనె, అవకాడో నూనె, అర్గన్ నూనె, ఆముదం నూనె, ద్రాక్ష

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది