Hair Tips : జుట్టు ఒత్తుగా పెరగాలన్న, మీరు నాజూగ్గా కనపడాలన్న ఈ లడ్డు రోజుకొకటి తీసుకోండి.
Hair Tips : అవిస గింజలు: ఇవి అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ వీటిలో ఎంతో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అవిస గింజలలో ఒమేగా ఫ్యాట్ 3 ఉంటుంది. ఇవి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులును కూడా నివారిస్తాయి. అటువంటి లడ్డును ఇప్పుడు మనం తయారు చేసుకుందాం… ఈ లడ్డు తీసుకోవడం వలన నాజుగా కూడా తయారవుతారు.
ఈ లడ్డు కి కావాల్సిన పదార్థాలు : అవిస గింజలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లం యాలకులు మొదలైనవి.
దీని తయరీ విదానం : ముందుగా అవిసె గింజలు ఒక కప్పు, పల్లీల అరకప్పు, నువ్వులు ఒక కప్పు, ఎండుకొబ్బరి అరకప్పు, వీటిని విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత విడివిడిగా కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. తరువాత ఒక కప్పు బెల్లం తీసుకొని దానిని పాకం వచ్చేవరకు వేడి చేసి తీగపాకం వచ్చిన తర్వాత దానిలో యాలకులపొడి వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పొడులన్నిటిని కలిపి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దింపి. చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి అంతే అవిసె గింజల లడ్డు రెడీ.
ఈ లడ్డుని రోజుకొకటి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగముంటుంది. వీటిలో వాడిన అవిస గింజలు వీటిలో ఒమేగా ఫ్యాట్ 3 ఉండడం వలన గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. అలాగే జుట్టు ఊడే సమస్య నుంచి కూడా తగ్గిస్తుంది. అలాగే నువ్వులు ఈ నువ్వుల వలన బాడీకి కావాల్సిన కాలుష్యం దొరుకుతుంది. అలాగే పల్లీలు, కొబ్బరి వీటి వలన శరీరానికి అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ వీటి నుండి లభిస్తుంది. కాబట్టి ఈ లడ్డూను ఈ విధంగా చేసుకొని తినడం వలన సన్నగా, నాజుగ్గా, అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.