Hair Tips : తక్కువ సమయంలో తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మార్చే చిట్కా..
Hair Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలిలో చిన్న పెద్ద వయసు తరహా లేకుండా జుట్టుతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకు కారణం సరియైన పద్ధతిలో ఫుడ్ ను తీసుకోకపోవడం, ఒత్తిడికి గురవడం సరియైన నిద్ర లేకపోవడం, వాతావరణ పరిస్థితులు వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జుట్టు సమస్యలలో తెల్ల జుట్టు రావడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య వాతావరణంలోని కాలుష్యం వలన తెల్ల జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యలకు సరిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే.. ఈ సమస్య తగ్గించుకోవచ్చు.. అదేవిధంగా నిత్యము తీసుకునే ఫుడ్ లో మార్పు చేసుకోవడం కొన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో చేర్చుకున్నట్లైతే ఈ సమస్యల నుంచి కొంచెం ఉపశమనం కూడా కలుగుతుంది.
అదేవిధంగా నిత్యము 8 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రను సేవించడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అదేవిధంగా కొన్ని ఒత్తుల నుంచి రిలాక్స్ అవుతూ ఉండడం, ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ తెల్ల జుట్టు సమస్య బారి నుంచి బయటపడాలి అంటే. అప్పుడప్పుడు హెన్నా తెచ్చుకొని అప్లై చేసుకోవడం వల్ల ఈ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. అదేవిధంగా మార్కెట్లో హెన్నా పేస్ట్ కూడా అందుబాటులో దొరుకుతుంది. దానిని తీసుకువచ్చి ఒక గిన్నెలో వేసుకొని దానిని బాగా కలిపి జుట్టు కుదుల నుంచి చివరి వరకు అప్లై చేసి 45 నిమిషాలు పాటు ఉంచి తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడుసార్లు చేయడం వలన తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. అదేవిధంగా జుట్టు సిల్కీగా మెరుస్తూ ఉంటుంది.
అదేవిధంగా ఇది కూడా చేసుకొని సమయం లేని వారికి ఈ హెన్నా హెయిర్ ఆయిల్ కూడా మార్కెట్లోకి వచ్చింది. ఈ ఆయిల్ జుట్టుకి అప్లై చేయడం వలన కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అదేవిధంగా ఈ మిశ్రమాలతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు కూడా చేసుకుంటూ ఉండాలి. జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. నిత్యము లేదా అప్పుడప్పుడు ఉసిరి కాయలను ఆహారంలో చేర్చుకున్నట్లైతే.. ఈ జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకనగా ఈ ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల జుట్టు ను నల్లగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చిట్కాలను పాటిస్తూ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి..