Hair Tips : దీనిని షాంపూ తో కలిపి వాడితే మీ జుట్టు పది రెట్లు బాగా పెరుగుతుంది…
Hair Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో జుట్టు రాలే సమస్యలు అధికమవుతున్నాయి. ఈ సమస్యకి కారణం సరియైన ఫుడ్ తీసుకోకపోవడం, వాతావరణం లోని కాలుష్యం, కొన్ని అనారోగ్య సమస్యలు జుట్టుకి సరియైన పోషణ లేకపోవడం, ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఒత్తిడిలు వలన కూడా ఈ సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి.ఈ జుట్టు రాలే సమస్య కోసం ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అటువంటి ప్రొడక్ట్స్ అవసరం లేకుండా మీరు నిత్యము తలస్నానానికి ఏ షాంపూ అయితే వాడుతారు దాంతో దీనిని కలిపి అప్లై చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
వీటిలో ఫస్ట్ టిప్.. దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిని స్టవ్ పై పెట్టి ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. తర్వాత దానిలో ఐదు మందార ఆకులను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. తర్వాత రెండు చెంచాల మెంతులని వేసుకోవాలి. ఈ మెంతులు జుట్టు మెరిసిపోవడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇలా నీటిలో మరగబెట్టి పది నిమిషాల తర్వాత దింపుకోవాలి. తర్వాత దీనిని చల్లార్చుకొని వడకట్టుకొని దీనిని షాంపూతో కలిపి నిత్యము తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.
2వది.. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. తరువాత దాన్లో రెండు చెంచాల టీ పొడిని వేసుకోవాలి. దీనిలో కాఫీ పొడిని కూడా వాడుకోవచ్చు. రెండు నిమిషాల వరకు దానిని మరగబెట్టి తర్వాత ఐదు మందార ఆకులని కూడా ముక్కలుగా చేసి దాంట్లో వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుతూ మరగబెట్టి తర్వాత స్టవ్ ఆపి దానిని దింపి చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ దీనిని తలస్నానం చేసే టైంలో నీటిలో నిత్యము వినియోగించే షాంపుతో కలుపుకొని తలస్నానం చేయాలి. ఇలా పది రోజులు చేయడం వలన జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. ఈ జుట్టు రాలే సమస్య నుండి విముక్తి కలుగుతుంది. ఎటువంటి హెయిర్ ఆయిల్స్ ఉపయోగించిన, ఎటువంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోకపోయినా, సరే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వాడుకోవచ్చు.