Health Benefits : యాలకులతో ఇన్ని ప్రయోజనాలా.. అస్సలు వదలకండి.. వీళ్లకి మరీ ముఖ్యం
Health Benefits : వంటగదిలో రోజువారీ వంటలలో ఉపయోగించే పదార్థాలలో యాలకులు ఒకటి. స్పైసీ వంటకాలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రుచినికే కాకుండా యాలకులకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కూడా ఉంది. సాధారణంగా, సుగంధ ద్రవ్యాలు శరీరంలో వేడిని పెంచే గుణాలు కలిగి ఉంటాయి. కానీ ఇవి మాత్రం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయ పడుతుంది.దీని శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి […]
Health Benefits : వంటగదిలో రోజువారీ వంటలలో ఉపయోగించే పదార్థాలలో యాలకులు ఒకటి. స్పైసీ వంటకాలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రుచినికే కాకుండా యాలకులకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కూడా ఉంది. సాధారణంగా, సుగంధ ద్రవ్యాలు శరీరంలో వేడిని పెంచే గుణాలు కలిగి ఉంటాయి. కానీ ఇవి మాత్రం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయ పడుతుంది.దీని శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క.
ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయ నాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విల క్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండూ ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుం టాయి.యాలకులు జీర్ణశక్తి మెరుగుపరుస్తాయి. అలాగే నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటు, ఉబ్బసం, అజీర్ణం, డైసూరియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాంతులు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గొంతు చికాకు, గ్యాస్ట్రిక్, గురక, దాహం, అజీర్ణం వంటి ఈ సమస్యలన్నింటినీ తగ్గించే శక్తి వీటికి ఉంది.
నోటిపూత నుండి ఉపశమనం పొందేందుకు యాలకులను ఉపయోగించవచ్చు. అలాగే యాలకుల కషా యం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉం టుంది.యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్లను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి, పుండ్లకి పైలేపనంగా వాడితే తొందరగా మానిపోతాయి. వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు (అల్సర్స్) కూడా తగ్గుముఖం పడ తాయి. చాలా రకాల రుగ్మతలకి యాలకులు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. యాలకుల తైలం పంటినొ ప్పిని నివారించి, క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది. దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.