Health Benefits : ఉక్కులాంటి ఎముకలు కావాలంటే.. ఈ ఒక్క చిట్కా పాటించండి చాలు!
Health Benefits : శరీరానికి రక్షణ కల్పించే వ్యవస్థను రక్షణ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ శరీరానికి చాలా ముఖ్యమైనది. ప్రధానమైనది. శరీర రక్షణ వ్యవస్థలో తెల్ల రక్త కణాలను లింఫోసైట్స్,మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ గా విభజిస్తారు. ఈ కణాలు ఎముక మధ్యలో తయారవుతాయి. వీటి జీవితకాలం 10 నుంచి 15 రోజులు మాత్రమే చనిపోయిన తర్వాత వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరగడం అత్యంత కీలకం. బోన్ మధ్య నుండి ఈ తెల్ల రక్త కణాలు పుడుతూ ఉంటేనే శరీరానికి కావాల్సిన రక్షణ వ్యవస్థ సక్రమంగా తన విధిని నిర్వర్తిస్తుంది. శరీరంపై చేసే బ్యాక్టీరియా, వైరస్‌ల బారి నుండి శరీరాన్ని కాపాడతాయి. అయితే ఇలా క్రమం తప్పకుండా ఉత్పత్తి అయ్యేందుకు తగిన పోషకాలు కావాల్సి ఉంటుంది.
ఎముక మజ్జ కు కావలసిన పోషకాలు విటమిన్ ఏ విటమిన్ కె, క్యాల్షియం. ఈ మూడు పోషకాలు మునగ ఆకుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకులను ఆహారంలో తీసుకోవడం వలన రక్షక వ్యవస్థ మెరుగుపడుతుంది. మునగ ఆకుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. పాల కంటే మూడు రెట్లు కాల్షియం ముగలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.పూర్వం కూరలు ఏమి లేక మునగ ఆకులను వండుకుని కొంత మంది తినేవారు. అప్పుడు వాళ్ళకి మునగాకు ప్రయోజనాలు తెలియకపోయినా కూడా వాటి వల్ల చాలా మంచే జరిగేది. కొంత మంది రుషులు మునగాకు ప్రయోజనాలు చెప్పడం వలన తినేవారు. కానీ మనకి మునగాకు ప్రయోజనాలు తెలిసినప్పటికీ తినట్లేదు. కంది పప్పును మూడు వంతులు ఉడికించి మునగ ఆకు అందులో వేసి ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
చపాతి పిండిలో మునగ ఆకు కలిపి పుల్కా చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. మునగాకు రసం తీసి అన్నం వండేటప్పుడు కూరలలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా పోషకాలు కూడా లభిస్తాయి. మునగాకు వేసి కషాయం చేసుకుని రోజు ఉదయాన్నే తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మునగాకుల్లో 13 కేలరీలు ఉంటాయి. 0.3 గ్రా కొవ్వు, 2 గ్రా ప్రోటీన్ మరియు 1.7 గ్రా కార్బోహైడ్రేట్ ఉంటాయి. రెండోది గ్రా చక్కెర మరియు 0.4 గ్రా డైటరీ ఫైబర్, మిగిలినవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మునగ ఆకులు కొవ్వు మరియు సున్నా కొలెస్ట్రాల్ ఉంటాయి. ఎముకలను ఆరోగ్యవంతంగా మార్చుతుంది. వారానికి 2 సార్లు ఐనా మునగాకు తినాలి. మునగ ఆకులను ఆకుకూరలతో పాటు వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.