Health Benefits : ఈ డ్రింక్ ను నెలకు ఒకసారి త్రాగారంటే.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..
Health Benefits : కిడ్నీలు మన శరీరంలోని వ్యర్ధపదార్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా కిడ్నీలు ఎప్పటికప్పుడు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. అలాగే బిపి, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృధా చేసుకుంటున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటే కిడ్నీలు పదిలంగా ఉంటాయి. అయితే నెలకు ఒకసారి ఈ డ్రింకును తయారు చేసుకొని తాగితే కిడ్నీలు శుభ్రం అయిపోతాయి. అయితే ఇప్పుడు ఈ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఈ డ్రింకును తయారు చేసుకోవడానికి ముందుగా ఒక స్పూన్ ధనియాలు తీసుకొని రోటిలో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లలో దంచుకున్న ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ధనియాలు గ్యాస్ ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే కిడ్నీలను కూడా శుభ్రం చేయడంలో బాగా సహాయపడతాయి. జీలకర్ర కూడా శరీరంలో గ్యాస్ ఎసిడిటీ, అజీర్తి సమస్యలు, అధిక బరువును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది. రెండు గంటలు నానిన తర్వాత ఈ నీటిని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి ఐదు లేదా పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి.
తర్వాత ఈ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. రుచి కోసం ఒక స్పూన్ తేనె కలుపుకొని త్రాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె వేసుకోకూడదు.దీనికి బదులుగా చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింకును ఉదయాన్నే పరిగడుపున త్రాగాలి.ఉదయాన్నే తాగలేనివారు మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ డ్రింకును త్రాగాలి. ఈ డ్రింక్ ను ప్రతిరోజు త్రాగాల్సిన అవసరం లేదు. నెలకి ఒకసారి త్రాగిన కిడ్నీలు మొత్తం క్లీన్ అయిపోతాయి. ఈ డ్రింక్ త్రాగడం వలన కిడ్నీలు శుభ్రం అవ్వడమే కాదు పొట్టలో స్టాక్ ఉండిపోయిన మలం కూడా బయటకు వచ్చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఈ డ్రింకు పొట్ట మరియు పేగులను శుభ్రం చేస్తాయి. ఈ డ్రింక్ ను అన్ని వయసుల వారు త్రాగవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.