Health Benefits : హాయిగా నిద్రపోవాలంటే… ఇవి చిటికెడు నమలండి
Health Benefits : నిద్రలేమి.. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. నిద్రిస్తుండగా మధ్యలో ఒక్కసారిగా మెలుకువ రావటం… లేదా నిద్ర రాకపోవడం వంటి సమస్యలతో ఎన్నో ఆనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబధ్ధకం, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహారాలు కూడా నిద్రాభంగానికి కారణం అవుతాయి. వాతం వికటించటం వలన మానసిక లక్షణాలు, కీళ్ళవాతంలాంటి ఇతర వాత వ్యాధులు ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీరంలో బాగా వేడి చేసినప్పుడు పడుకోగానే నిద్రపట్టినా, వెంటవెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది. గుండె దడ, భయంగా ఉండటంలాంటి సమస్యలు ఉత్పన్నమై నిద్రాభంగాన్ని కలిగిస్తాయి.భారతీయుల వంటల్లో ఉపయోగించే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. ఇవి ఆవాలు కంటే చిన్నగా తిన్నపుడు కాస్త తీపి, కాస్త వగరు కలిసిన రుచితో ఉంటాయి. వీటికి చలువ చేసే గుణం ఎక్కువ.
పాయసాలు, ఇతర తీపి వంటకాలలోనే కాకుండా, మసాలా కూరల్లో కూడా గసాగసాలను రుచి కోసం ఉపయోగిస్తారు. గసగసాలు అనేవి నల్లమందు మొక్క నుండి లభ్యమయ్యే విత్తనాలు. అందుకే ఇవి కాస్త మత్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. గసాగసాలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు.రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడానికి పాలు, గసగసాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పాలల్లో కొద్దిగా గసగసాలు వేసుకుని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే ఒత్తిడి, నీరసం పూర్తిగా తగ్గిపోయి మంచి నిద్ర వస్తుంది. గసగసాలు రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది.గసాలు పాలు పోసి కూర వండుకుని తినచ్చు. పచ్చివి నోట్లో వేసుకుని నమలచ్చు. దోరగా వేయించి డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ బార్ లాంటి వాటితో జతచేయవచ్చు.
Health Benefits : పాలలో కులుపుకొని తీసుకుంటే..
గసగసాలు తీసుకుంటే గాయాలు తగిలినపుడు రక్తం గడ్డకట్టే ప్రక్రియను అక్టీవ్ చేస్తుంది. గసాలలో ఉండే ప్రోటీన్ శరీరంలో కణాలు, మరియు కనజాలాలను నిర్మించడానికి మరియు దెబ్బ తిన్న కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ద్రవాలు సమతాస్థితిలో ఉండేందుకు గసాలు తోడ్పడతాయి.అలాగే గసగసాలలో విటమిన్ ఏ ఉండటం వల్ల వీటిని తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. గసగసాలలో ప్రోటీన్లు, మరియు విటమిన్ సి ఉండటం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తి ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒక స్పూన్ గసగసాలను పచ్చిగానే నోట్లో వేసుకుని మెల్లగా నమిలి తినడం వల్ల నోటి పూతలు తగ్గిపోతాయి.
అధిక వేడి శరీరం ఉన్నవారికి తొందరగా ఎసిడిటీ సమస్యలు వస్తాయి. గసాలు, పంచదార సమానంగా తీసుకుని మెత్తని పొడి చేసి తీసుకుంటూ ఉంటే గుండె సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.అయితే నిద్రలో తేడా వస్తోందంటే తేలికగా అరిగే ఆహారాన్ని… చలవ చేసేపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఊరగాయ పచ్చళ్లు, అల్లం వెల్లుల్లి మసాలాలు, పులుపు పదార్థాలు, నూనె పదార్థాలను మానటం వలన కొంతమేర ఉపశమనం లభిస్తుంది. శరీరానికి తగిన వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు నడవటం, రాత్రి ఆహారాన్ని త్వరగా ముగించుకోవటం 9గంటలకల్లా నిద్రకు ఉపక్రమించటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది.