Health Benefits : ఇలా చేస్తే మలబద్దకానికి ఒకే రోజులో చెక్.. కానీ ఈ మిస్టేక్ మాత్రం చేయకండి
Health Benefits : మలబద్దకం చాలా మందిని వేధిస్తున్న సమస్య. వృద్దుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మారిన జీవన విధానం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా నీళ్లు తాగకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. చిరాకు, మానసిక ఒత్తిడి కూడా మలబద్ధనికి కారణం అవుతాయి. జంక్ ఫుడ్, అయిల్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. క్రమంగా మలబద్దకానికి దారితీస్తుంది.అలాగే డయాబెటిస్, పీసీఓడీ, నిద్ర లేకపోవడం, హైపర్ థైరాయిడ్ తో పాటు బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలతో బాధపడేవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
అయితే మలబద్ధకం దీర్ఘకాలికంగా కొనసాగితే జీర్ణాశయ వ్యాధులు, హైపర్ టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాగా ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ ఈ సమస్య కు చెక్ పెట్టొచ్చు. మరిన్ని పరిష్కారాలు ఇప్పడు చూద్దాం.ఆరేంజ్ ఫ్రూట్స్ మలబద్దకాన్ని నివారించడంలో అద్బుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సీ, ఫైబర్ రెగ్యూలర్ గా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్యను నివారించవచ్చు. డైలీ మార్నింగ్ ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే చక్కటి ఉపశమనం లభిస్తుంది.
అలాగే రోజు తగినన్ని నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఈ సమస్య ఉన్నవారు ప్రతి గంటకి వాటర్ తాగేలా అలవాటు చేసుకోవాలి.కొన్ని సహజ చిట్కాల ద్వారా కూడా మలబద్దకాన్ని తరిమేయెచ్చు. ఒక గ్లాసు నీటిలో వాము, అతిమదురం వేర్లను నానబెట్టాలి. ఈ నీళ్లకు మరిన్ని వాటర్ చేర్చి మరిగించాలి. ఇందులో అల్లం ముక్కను తురిమి వేసి మరికొద్దిసేపు మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి ఇందులో బ్లాక్ సాల్డ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి. దీంతో మల మెత్తబడి మోషన్ సాఫీగా సాగుతుంది.