Health Benefits : ఈ పువ్వు తింటే రోగాలు ద‌రిచేర‌వ్.. లివ‌ర్ కూడా రి ఫ్రెష్ అవుతుంది వెంట‌నే తినేయండి మ‌రి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ పువ్వు తింటే రోగాలు ద‌రిచేర‌వ్.. లివ‌ర్ కూడా రి ఫ్రెష్ అవుతుంది వెంట‌నే తినేయండి మ‌రి..

Health Benefits : చింత చెట్టును మన భారతదేశ ఖర్జూరం చెట్టు గా కూడా పిలుస్తారు. చింత చిగురు చింతకాయలు వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత చెట్టు కలపను కూడా ఆయుర్వేదంలో వాడ‌తారు. ఇక ఆరోగ్యకరమైన ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. చింత గింజల నుండి ఎక్కువ మోతాదులో క్యాల్షియం లభిస్తుంది. అలాగే ఆకలి మందగించిన, మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కూడా చింతపండు చాలా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని చింత పండు రసంతో వాపు ఉన్న […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 March 2022,3:00 pm

Health Benefits : చింత చెట్టును మన భారతదేశ ఖర్జూరం చెట్టు గా కూడా పిలుస్తారు. చింత చిగురు చింతకాయలు వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత చెట్టు కలపను కూడా ఆయుర్వేదంలో వాడ‌తారు. ఇక ఆరోగ్యకరమైన ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. చింత గింజల నుండి ఎక్కువ మోతాదులో క్యాల్షియం లభిస్తుంది. అలాగే ఆకలి మందగించిన, మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కూడా చింతపండు చాలా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని చింత పండు రసంతో వాపు ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా మర్దనా చేస్తే ఉపశమనం కూడా కలుగుతుంది.100 గ్రాముల చింతపండు 283 కేలరీల శక్తిని ఇస్తుంది.సిట్రిక్ యాసిడ్‌ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి, కడుపు ఉబ్బరానికి, జ్వరం,వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు.

ఆకలి మందగించినవారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే మంచి ఆకలి పుడుతుంది. అజీర్ణరోగాలకి, జీర్ణశక్తిని పెంచ డానికి చింతపండు దివౌషధంగా ఉపయోగ పడుతుంది.అలాగే చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. ప్రకృతిదక్షిణ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చారు, సాంబారు మొదలైనవి ప్రతిరోజూ వాడుతూవుంటారు కాబట్టి
మూత్రకోశ వ్యాధులు, మూత్రకోశంలో రాళ్లు, మొదలైన వ్యాధులు తక్కుగా వుంటాయి. చింతచిగురులో విటమిన్ ఏ, సీ, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి.గ్లాస్ నీటిలో చింత పువ్వు వేసి బాగా మ‌రిగించాలి.

Health Benefits in chinta puvvu

Health Benefits in chinta puvvu

Health Benefits : చింత చిగురుతో ఎన్నో లాభాలు..

ఈ నీటిని ఫిల్ట‌ర్ చేసి తాగితే జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతాయి. చింత పువ్వు ప‌చ్చ‌డి చేసుకుని తిన‌డం వ‌ల్ల వాతం, క‌ఫం, పిత్త స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. దీనివ‌ల్ల ర‌క్త విరోచ‌నాలు త‌గ్గుతాయి. అలాగే లివ‌ర్ ని ఫ్రెష్ చేస్తుంది. బాడీలో క్యాన్స‌ర్ క‌ణాల‌ను తొల‌గించి క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటుంది. చింత పువ్వు తిన‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ది చేయ‌బ‌డి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పొట్ట‌లో నులిపురుగులు చ‌నిపోతాయి.అలాగే శ‌రీరంలో అధిక వేడిని త‌గ్గిస్తుంది. యూరిన్లో మంట కూడా చింత‌పువ్వు త‌గ్గిస్తుంది. డ‌య‌బెటిస్ ఉన్న‌వారికి షుగ‌ర్ కంట్రోల్ లో ఉంచుతుంది. దీన్లో ఉన్న విట‌మిన్ సీ చ‌ర్మ కాంతిని కూడా పెంచుతుంది. ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్న చింత‌పువ్వును మీరుకుడా తినండి మ‌రి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది