Health Benefits : సమ్మర్ లో నీళ్లు ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా.. వెంటనే ఇవి పాటించండి
Health Benefits : ఎండాకాలంలో చాలా మంది చేసే మంచి పని ఏంటంటే నీళ్లు ఎక్కువగా తాగటం. చలికాలం, వర్షాకాలంతో పోలిస్తే ఎండాకాలంలో వాటర్ ఎక్కువగా తాగుతుంటారు. దీంతో బాడీలో ఉన్న మలినాలు, విషపదార్థాలు ఎక్కువగా చెమట రూపంలో, యూరిన్ రూపంలో బయటకి పంపించబడతాయి. అలాగే చెమట ఎక్కువగా రావడం వల్ల చర్మంలోని శ్వేద గ్రంథులు తెరుచుకోవడంతో శరీరం డిటాక్సిఫై అవుతుంది. అలాగే చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. కాగా చెమట వాసనతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా నీరు తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపషమనం లభిస్తుంది.
అలాగే సమ్మర్ లో చాలా మంది రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. జుట్లు సమస్యలు కూడా కొంత వరకు దూరం అవుతాయి. అయితే ఇదంతా సమ్మర్ లో ఎండకు ఉండే వారికి జరుగుతుంది. కానీ ఎంతో మంది ఏసీల్లో కూర్చుని పనులు చేసుకుంటున్నారు. వీళ్లకు చెమట అంతగా రాదు. దీంతో బాడీలోని మలినాలు అక్కడే పేరుకుపోతాయి. అలాగే ఏసీలో ఉండేవారు నీళ్లు కూడా ఎక్కువగా తాగడానికి ఆసక్తి చూపరు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఎలాంటి ఎన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అధిక బరువు ఉన్నవాళ్లు కూడా రెగ్యూలర్ గా వాటర్ ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారు.అంతే కాకుండా నీరు తాగటం వల్ల కడుపు నిండిన భావనతో ఫుడ్ తక్కువగా తీసుకుంటారు. శరీరంలోని వేడి తగ్గించుకోవడానికి పరగడుపున నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగితే బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఇంకా జీర్ణక్రియను కూడా వేగవంతం చేస్తుంది. అలాగే ఉదయాన్నే గొరువెచ్చటి నీళ్లను తీసుకుంటే డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. అందుకే సమ్మర్ లో నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.