Health Benefits : శ్లేష్మం, కఫం తగ్గించడానికి… ఇలా చేస్తే బెటర్.. లంగ్స్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్
Health Benefits : వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం, కళ్లపైనే కాకుండా, ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి.గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఫంగస్, దుమ్ము, ధూళి, పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆక్సైడ్, హైడ్రోజన్ సల్పైడ్, క్లోరిన్, నైట్రికి ఆకై్సడ్ తదితరాలు ఉంటాయి.
ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు, కఫం, పిల్లికూతలు, ఛాతీ పట్టేయడం జరుగుతుంది. వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. కొంతమందిలో గాలిలో ఉండే ఫంగస్, ఆస్పర్జిల్లస్, కాండిడా, పెన్సిల్లియమ్‌లు ఊపిరితిత్తులోకి చేరి న్యూమోనియా, ఉబ్బసం, ఎక్స్‌ట్రిన్సిక్ ఎలెర్జిక్ అల్వియోలైటిస్ అనే వ్యాధులు కలుగచేస్తాయి.వేడి పానియాలు తాగడం వల్ల చాతిలో శ్లేష్మం ఏర్పడటం నుంచి ఉపషమనం పొందవచ్చును. దీంతో తుమ్ము, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు తగ్గి దీర్ఘకాలిక ఉపషమనం లభిస్తుంది. అలాగే వేడి నీళ్ల నుండి ఆవిరిని పీల్చండం ద్వారా శ్వాసనాళంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వేడి నీళ్లతో స్నానంచేస్తే పేరుకుపోయిన సైన్స్, గొంతులోని కఫం తగ్గుతాయి. పడుకునే ముందు ఆవిరి పట్టడం వల్ల మంచి నిద్రపడుతుంది.
Health Benefits : శ్లేష్మాన్ని తగ్గించే చిట్కాలు..
ప్రతిరోజూ కనీస౦ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శ్లేష్మం, కఫం తగ్గుతాయి. అలాగే గొంతులోని నీటిని బైటికి తీయడానికి, కఫం తొలగించడానికి తరచుగా ముక్కును చీదాలి. ఉప్పు నీటిని వేడి మిశ్రమాలతో కలిపి పుక్కిలించడం ద్వారా శ్లేష్మం, కఫం బయటకు వెళ్లిపోతాయి. రెగ్యూలర్ గా తేనె తీసుకోవడం వల్ల కూడా శ్వాస సంబంధిత సమస్యలు తొలగుతాయి.అలాగే కొన్నిచుక్కల యూకలిప్టస్ ఆయిల్ ని వపోరైజర్ లో వేసి పీలిస్తే కఫం నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. డైరీ ఉత్పత్తులు, మాంసం లేదా వేపుడు వంటివి కఫాన్ని వృద్ది చేసే పదార్ధాలను ఎక్కువగా తినకూడదు. ముక్కురంధ్రాలు తేమగా ఉండడానికి, శ్లేష్మం తగ్గడానికి హెర్బల్ టీ లేదా ఉడకబెట్టిన చికెన్ పులుసు వంటి వేడి పదార్థాలను తాగినా ప్రయోజనం ఉంటుంది. అలాగే వెల్లుల్లి, నిమ్మ, అల్లం కొద్దిమొత్తంలో తీసుకోవడం వల్లకూడా శ్వాస సంబంధిత సమస్యలు దూరం చేయవచ్చు.