Health Benefits : పరిగడుపున కలబంద జ్యూస్ ను తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!!
Health Benefits : కలబంద ఎంతో అద్భుతమైన మూలిక. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ అలోవెరా జ్యూస్ అనేది జీవ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇది గ్యాస్ మరియు మలబద్ధకం లాంటి సమస్యలను నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. ఈ అలోవెరా జ్యూస్ లో చాలా తక్కువ మోతాదులో కెలరీలు ఉంటాయి. అలాగే జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. ఇది బరువును తగ్గించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ అలోవెరా లో ఉన్నటువంటి విటమిన్ సి రోగనిరోధక శక్తిని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే జలుబు మరియు జ్వరాలు లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అలాగే ఈ అలోవెరా లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో రకాల వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.
ఈ అలోవెరా జ్యూస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. అయితే ఈ జ్యూస్ ను పరిగడుపున తాగటం వలన కొన్ని దుష్ఫలభావాలు కూడా ఉండవచ్చు… మధుమేహ సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ ను తీసుకుంటే మంచిది అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ కలబందలో సహజంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు మరియు యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన రక్తంలోని చక్కెర స్థాయి లను తగ్గించడమే కాకుండా మధుమేహాన్ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అయితే మీరు ఈ జ్యూస్ ను తాగే ముందు కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి.
అయితే ఈ అలో వేరా లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు చర్మాన్ని ఎంతో మాయిశ్చరైజ్ చేసి ముఖంపై ఉండే మచ్చలు మరియు మొటిమలు లాంటి సమస్యలను నియంత్రిస్తుంది. అలాగే ఉదయాన్నే పరగడుపున కలబంద రసాన్ని తీసుకుంటే చర్మం ఎంతో మృదువుగా మరియు తాజాగా మెరిసేలా చేస్తుంది… ఈ కలబంద జ్యూస్ తాగటం వలన కురులు కూడా ఎంతో బలంగా తయారవుతాయి. అలాగే మృదుత్వాన్ని కూడా ఇస్తుంది. అయితే నిత్యం పరిగడుపున ఈ కలబంద జ్యూస్ తాగితే కురులు ఎంతో ఒత్తుగా పెరుగుతాయి. అయితే చాలామందికి కలబంద జ్యూస్ కడుపులోని మంట మరియు అతిసారం లాంటి జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు అలోవెరా జ్యూస్ ను తాగడానికి ముందు వైద్యులకు కచ్చితంగా సంప్రదించాలి…