Anjeer Juice : ప్రతిరోజు అంజీర్ ను డ్రై ఫ్రూట్ లా కాకుండా ఇలా గనక తీసుకుంటే…. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు…!
ప్రధానాంశాలు:
Anjeer Juice : ప్రతిరోజు అంజీర్ ను డ్రై ఫ్రూట్ లా కాకుండా ఇలా గనక తీసుకుంటే.... ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు...!
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్ ను పండు లేక డ్రై ఫ్రూట్ గా తీసుకుంటూ ఉంటాం. అలాగే దీనితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే ఈ అంజీర్ కేవలం డ్రైఫ్రూట్ గా కాకుండా అంజీర్ జ్యూస్ తాగడం వలన కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అయితే పోషకాలు అధికంగా ఉండే ఈ అంజీర్ ను జ్యూస్ రూపంలో తీసుకుంటే మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అంజీర్ జ్యూస్ తాగటం వలన మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు నిపుణులు. అలాగే కడుపుకు సంబంధించిన సమస్యల నుండి కూడా ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అజీర్తి సమస్యలకు దివ్య ఔషధంగా పని చేస్తుంది అని అంటున్నారు. అయితే ఈ జ్యూస్ ను తాగడం వలన శరీరానికి పీచు, పొటాషియం, కాల్షియం లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శ్వాస కు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి కూడా అంజీర్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ అంజీర్ రసంలో ఉండే ఫినోలిక్ యాసిడ్ అనేవి శ్వాస కోస సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే గొంతులో సమస్యలు మరియు కఫం లాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా అంజీర్ జ్యూస్ ఎంతో బాగా పని చేస్తుంది అని అంటున్నారు.
ఇకపోతే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అంజీర్ కచ్చితంగా తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. అయితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అంజీర్ జ్యూస్ ఆందోళన మరియు మైగ్రేన్, నిద్రలేమి సమస్యలను దూరం చేయటం లో కూడా హెల్ప్ చేస్తుంది.ఇక ఈ జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మన మలబద్ధకాన్ని దూరం చేయటంతో పాటుగా బరువును కూడా ఈజీగా తగ్గిస్తుంది. అయితే మీరు సాయంత్రం స్నాక్స్ కి బదులుగా అంజీర్ జ్యూస్ ను తాగితే మీరు బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా ఈ అంజీర్ జ్యూస్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే యాంటీ యూరోలిథియాటిక్ రాళ్ల సమస్యను దూరం చేస్తుంది. అలాగే భవిష్యత్తులో రాళ్లు అనేవి ఏర్పడకుండా కూడా చూస్తుంది…