Health Benefits : ఈ జ్యూస్ డయాబెటిక్ పేషెంట్లకు మంచిదేనా..? ఇందులో నిజం ఎంత…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ జ్యూస్ డయాబెటిక్ పేషెంట్లకు మంచిదేనా..? ఇందులో నిజం ఎంత…?

Health Benefits : వానాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి తింటూ, లైట్ గా జ్యూస్ చేస్తుంటే ఆ మజానే వేరు ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది శీతల పానీయాలను తీసుకుంటారు. ఇలాంటి సమయంలో చల్లని పానీయాలకు బదులుగా వైన్ సిరప్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో బేల్ సిరప్ రుచికరమైనది. బేల్ సిరప్ ను మారేడు పండుతో తయారు చేస్తారు. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :1 August 2022,5:00 pm

Health Benefits : వానాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి తింటూ, లైట్ గా జ్యూస్ చేస్తుంటే ఆ మజానే వేరు ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది శీతల పానీయాలను తీసుకుంటారు. ఇలాంటి సమయంలో చల్లని పానీయాలకు బదులుగా వైన్ సిరప్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో బేల్ సిరప్ రుచికరమైనది. బేల్ సిరప్ ను మారేడు పండుతో తయారు చేస్తారు. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వలన శరీరానికి శక్తి పుష్కలంగా అందుతుంది. మీ పొట్టలో సమస్య ఉంటే బేల్ సిరప్ తీసుకోవడం చాలా ఉపయోగకరం. ఈ సిరప్ ను ఉపయోగించడం వలన కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి.

అయితే అన్ని షర్బత్ లేదా పానీయాలు చక్కెర వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండవు. ఈ తీపి పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అలాగే వీటిలో చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో డయాబెటిక్ బాధితులు బేల్ సిరప్ ను త్రాగవచ్చో లేదో. తెలుసుకుందాం. ఈ బేల్ సిరప్ లో మంచి కొవ్వు, ఫైబర్, విటమిన్ సి ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బేల్ సిరప్ పొత్తికడుపులో నొప్పి, అతిసారం, విరేచనాలు, కడుపునొప్పి వంటి వ్యాధులను నయం చేయటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ సిరప్ శరీరంలో రక్తాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. తాజా పరిశోధనల ప్రకారం థైరాయిడ్ రోగులు తీసుకోవడం మంచిది కాదు.

Health Benefits of bale syrup for diabetes

Health Benefits of bale syrup for diabetes

ఎందుకంటే ఇది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన మందులను ప్రభావితం చేస్తుంది. గర్భిణి స్త్రీలు కూడా బేల్ సిరప్ తాగకూడదు. అలాగే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. డయాబెటిక్ బాధితులకు బెయిల్ జ్యూస్ ఆరోగ్యకరమైనది కాదు. అది వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. బేల్ జ్యూస్ లో ఉండే చక్కెర డయాబెటిక్ బాధితులకు హానికరం. నిజానికి బేల్ సిరప్ ఎండాకాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు బేల్ సిరప్ ను త్రాగకూడదు. గర్భిణి స్త్రీలు తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే గర్భధారణలో దాని ప్రయోజనం గురించి ఎటువంటి ఆధారాలు లేవు. బేల్ జ్యూస్ గర్భస్రావాన్ని కలిగించవచ్చు అని కొందరు అంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది