Health Benefits : వర్షాకాలంలో అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా…?
Health Benefits : వర్షాకాలం వచ్చిందంటే వివిధ రకాల వ్యాధులు వచ్చినట్లే. చిటపట చినుకులు పడుతుంటే మనకేంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. అయితే సంతోషంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వర్షాల వలన మన చుట్టూ ప్రక్కల పరిసరాలు బురదమయంగా మారుతాయి. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోవడం వలన అనేక జబ్బులు మనల్ని వెంటాడుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో జలుబు, జ్వరం వంటివి వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే వర్షాకాలంలో ఆహారపరంగాను, ఆరోగ్యపరంగాను జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఏవిపడితే అవి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే సీజనల్ గా వచ్చే వ్యాధులను తట్టుకోలేం.
అయితే సీజన్ తో సంబంధం లేకుండా చౌకగా, విరివిగా లభించే పండ్లలో ఒకటి అరటిపండు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పండు ఆరోగ్యపరంగా చాలా మంచిది. అయితే వానాకాలంలో అరటి పండును తినొచ్చా లేదా అని సందేహం చాలామందికి ఉంటుంది. అయితే ఈ కాలంలో అరటిపండును నిరభ్యంతరంగా తినవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండును తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటున్నారు. ఈ పండులో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అజీర్తి, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట అరటి పండ్లను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే అరటి పండ్లతో పాటు కొన్ని ఆహారాలను కలిపి తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా అరటికాయ తిన్న వెంటనే పాలు త్రాగకూడదు. అలా త్రాగితే అది విషపూరితంగా మారుతుంది. దీని వలన కఫ దోషం పెరుగుతుంది. వర్షాకాలంలో శరీరం చాలా మార్పులు చెందుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే శరీరం అనేక వ్యాధుల బారిన పడుతుంది. అందుకని శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే అరటికాయలు తినాలి. అలాగని రాత్రిపూట కూడా అరటికాయను తినకూడదు. అలా తింటే గొంతులో కఫం ఏర్పడి దగ్గు వస్తుంది. కనుక మధ్యాహ్నం సమయంలో అరటికాయను తినాలి.