Banana Flower : అరటి పండే కాదు పువ్వు కూడా ఆరోగ్యానికి దివ్య ఔషధం…??
ప్రధానాంశాలు:
Banana Flower : అరటి పండే కాదు పువ్వు కూడా ఆరోగ్యానికి దివ్య ఔషధం...??
Banana Flower : అరటి పండ్లు మాత్రమే కాదు అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అలాగే అరటి పువ్వులో ఉండే ఎక్కువ పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. అంతేకాక మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా అరటి పువ్వు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఈ అరటి పువ్వులో ఉండే పోషకాలు అనేవి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. అలాగే గ్యాస్ మరియు అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా ఈ అరటిపండు ఎంతో మేలు చేస్తుంది…
ఇకపోతే ఆడవారిలో బహిష్టు టైమ్ లో అధిక రక్తస్రావాన్ని అరికట్టడానికి కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ అరటి పువ్వు తో చేసిన పదార్థాలు గనుక తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కూడా తగ్గిపోతాయి. అలాగే ప్రతినిత్యం 100 మిల్లి గ్రాముల అరటి పువ్వును తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. ఈ అరటి పువ్వు రక్తాన్ని శుభ్రం చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడేవారు మరియు కిడ్నీలో రాళ్ల సమస్యలతో ఇబ్బంది పడే వారికి అరటి పువ్వు ఎంతో మేలు చేస్తుంది…
అరటి పువ్వులు తీసుకోవడం వలన జీవక్రియ అనేది సక్రమంగా జరిగి సుఖ విరేచనాలు అవుతాయి. అంతేకాక మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ అరటి పువ్వులో ఉండే విటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే అరటి పువ్వులో ఉండే పొటాషియం మరియు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అలాగే పాలిచ్చే తల్లులకు అరటి పువ్వు చాలా మంచిది అని అంటున్నారు నిపుణులు