Health Benefits : కొబ్బరి నీళ్లను, తేనెను కలిపి త్రాగడం మంచిదా! కాదా! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Benefits : కొబ్బరి నీళ్లను, తేనెను కలిపి త్రాగడం మంచిదా! కాదా!

Health Benefits : మన హిందూ సాంప్రదాయాలలో కొబ్బరి బోండా కి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ వేదిక పైకి నడిచి వచ్చే పెళ్లికూతురు చేతులలో కొబ్బరి బోండా లేకుండా ఊహించలేం. గుండ్రంగా, మచ్చలు లేని నున్నని, లేలేత పచ్చని బొండా ఎంచుకొని మరి వివిధ కార్యక్రమాలలో ఉపయోగిస్తాం. అందువలనే మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న కొబ్బరి చెట్టు కల్పవృక్షమైనది. కొబ్బరి నీళ్లను త్రాగడం వలన అందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక […]

 Authored By anusha | The Telugu News | Updated on :6 July 2022,7:40 am

Health Benefits : మన హిందూ సాంప్రదాయాలలో కొబ్బరి బోండా కి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ వేదిక పైకి నడిచి వచ్చే పెళ్లికూతురు చేతులలో కొబ్బరి బోండా లేకుండా ఊహించలేం. గుండ్రంగా, మచ్చలు లేని నున్నని, లేలేత పచ్చని బొండా ఎంచుకొని మరి వివిధ కార్యక్రమాలలో ఉపయోగిస్తాం. అందువలనే మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న కొబ్బరి చెట్టు కల్పవృక్షమైనది. కొబ్బరి నీళ్లను త్రాగడం వలన అందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. శరీరంలో సహజ లవణాలను కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి విముక్తి పొందాలంటే కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా త్రాగాలి. అలాగే డయేరియాతో బాధపడే వారికి డిహైడ్రేషన్ కాకుండా కాపాడేది ఈ కొబ్బరినీళ్ళే. అలాగే తేనె కూడా మన శరీరానికి మంచి ప్రయోజనం కలిగిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజు కొద్దిగా తేనె ను తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఈ తేనె రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెరిగేలా చేస్తుంది. దీనిని ఎక్కువగా గోరువెచ్చని నీళ్లలో వేసుకొని తాగితే మంచిది. అయితే కొబ్బరినీళ్లు, తేనె కలిపి త్రాగడం మంచిదో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం… కొబ్బరి నీళ్లు, తేనె కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు కొబ్బరి నీళ్లలోని విటమిన్ సి మన బాడీలోని రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తాయి. అలసట, నీరసం లేకుండా శరీరం హుషారుగా ఉండేలా అవసరమైన శక్తిని అందిస్తాయి. అయితే కొబ్బరి నీళ్లు కలిపి త్రాగడం వలన కడుపునొప్పి, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు వంటి వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కొబ్బరినీళ్ళు, తేనెను కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం దక్కుతుంది. అలాగే మనం ఎటువంటి ఆహారం తీసుకున్న త్వరగా జీర్ణం అయ్యేలా సహాయపడతాయి.

Health Benefits of coconut water and honey

Health Benefits of coconut water and honey

అందుకని కొబ్బరి నీళ్లను, తేనెను కలిపి తీసుకుంటే మన శరీరానికి ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కొబ్బరి నీళ్లను, తేనెను కలిపి తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో కొన్ని ఆక్సైడ్లు మరియు లవణాలు మూత్రపిండాలలో పేరుకుపోయినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఇది ఒక తీవ్రమైన వ్యాధి. చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. కనుక రోజంతా మంచినీళ్లు త్రాగడంతోపాటు కొబ్బరి నీళ్లను తాగితే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడవు. కొబ్బరి నీళ్లు మరియు తేనెలో ఉండే పోషకాలు గుండె కండరాలను బలోపేతం చేస్తాయి. దీనివలన మన గుండె ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కొబ్బరి నీళ్లుల తేనే సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు మరియు తేనె రెండింటిలోనూ పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక రోజు మంచినీళ్లతో పాటు ఈ కొబ్బరినీళ్ళను, తేనెను కలిపి తీసుకుంటే మన శరీరానికి మంచి లాభాలు చేకూరుస్తాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది