Coffee : కాఫీ ఈ విధంగా తాగితే… ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Coffee : కాఫీ ఈ విధంగా తాగితే… ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా…!!

Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీని ఎంతో మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ కాఫీ అనేది శరీరానికి సహజమైన శక్తిని ఇస్తుంది. అలాగే ఈ కాఫీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాక బరువును నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే రోజువారి ఆహారంలో ఈ కాఫీని చేర్చుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… బరువు తగ్గండి : మీరు గనక బరువు తగ్గాలి అని అనుకుంటే మీకు కాఫీ ఉత్తమమైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Coffee : కాఫీ ఈ విధంగా తాగితే... ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా...!!

Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీని ఎంతో మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ కాఫీ అనేది శరీరానికి సహజమైన శక్తిని ఇస్తుంది. అలాగే ఈ కాఫీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాక బరువును నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే రోజువారి ఆహారంలో ఈ కాఫీని చేర్చుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

బరువు తగ్గండి : మీరు గనక బరువు తగ్గాలి అని అనుకుంటే మీకు కాఫీ ఉత్తమమైన మార్గం. ఈ తీయని కాఫీని తీసుకోవటం వలన మీ బరువును కూడా నియంత్రణలో ఉంచవచ్చు. అలాగే కాఫీ లో ఉన్నటువంటి కెఫిన్ జీవక్రియను పెంచడానికి మరియు కొవ్వును కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కెఫిన్ అనేది మీ హృదయ స్పందన రేటు మరియు శక్తిని కూడా పెంచుతుంది. అలాగే రోజంతా అధిక క్యాలరీలను బర్న్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది…

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి : యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా ఉండే వనరులలో కాఫీ కూడా ఒకటి. అలాగే గుండె జబ్బులు మరియు క్యాన్సర్, అకాల వృద్ధాప్యంతో సహా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ మరియు సెల్ డ్యామేజింగ్ మాలిక్యుల్స్ హానికరమైన ప్రభావాలతో పోరాడేందుకు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు హెల్ప్ చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ లు కొన్ని రకాల వ్యాధులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. అలాగే తీయని కాఫీ మీ శరీరం మొత్తం ఆరోగ్యాన్ని రక్షించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ కాఫీని తగిన మోతాదులో తీసుకుంటే డయాబెటిస్ మరియు గుండె సమస్యలు, స్ట్రోక్స్ ఇతర సమస్యల నుండి కూడా రక్షణ దొరుకుతుంది. అలాగే చర్మ ప్రెస్టేట్ లాంటి క్యాన్సర్లు రాకుండా కూడా రక్షిస్తుంది.

Coffee కాఫీ ఈ విధంగా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా

Coffee : కాఫీ ఈ విధంగా తాగితే… ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా…!!

మూడ్ పెరుగుదల : అయితే రోజు జరిగే కొన్ని విషయాలలో మనం బాగా అలసిపోతూ ఉంటాం. ఇది అనేది మానసిక అలసట మరియు ఒత్తిడికి కూడా కారణం అవుతుంది. అయితే ఈ కాఫీ ని తాగడం వలన మానసిక స్థితి అనేది మెరుగుపడుతుందని అంటారు. అయితే ఈ కాఫీలోని కెఫిన్ మన మెదడులో డొపమైన్ మరియు సెరోటోనిన్ లాంటి హార్మోన్లను విడుదల చేసెందుకు కూడా హెల్ప్ చేస్తుంది. ఈ కాఫీ యొక్క సువాసన మరియు రుచి మనస్సు శ్రేయస్సుకు కూడా హెల్ప్ చేస్తుంది. అయితే ప్రతిరోజు రెండు లేక మూడు కప్పుల టీ తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తారు అని ఒక అధ్యయనం లో తెలిపింది. ఈ కాఫీ అలవాటు అనేది డిప్రషన్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా రక్షిస్తుంది. అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటం లో కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాక హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అయితే కాఫీను మాత్రం మితంగా తాగితేనే మంచిది. ఈ కాఫీ ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఈ కాఫీని అధికంగా తాగడం వల ఆకలి అనేది తగ్గుతుంది. అలాగే నిద్రలేమి సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలకు కూడా దారి తీస్తుంది. అంతేకాక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే ఎసిడిటి సమస్య కూడా వేధిస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది