Health Benefits : జీలకర్రలో ఎన్ని గొప్ప ఔషధాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు…!!
Health Benefits : జీలకర్ర అంటే వంటింట్లో పోపు డబ్బాలో తప్పకుండా ఉంటుంది. దానిని ప్రతి వంటల్లో వాడుతూ ఉంటారు. అయితే ఈ జీలకర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసు కదా.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషధ గుణాలు చలికాలంలోనే కాకుండా ఏ కాలంలో అయినా ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కావున జీలకర్రను డైరెక్టుగా కాకుండా నీళ్లతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్తున్నారు. వైద్య నిపుణులు. ప్రస్తుతం ఉన్న జీవనశైలి విధానంలో ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడం తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్, వ్యాయామం లాంటి వాటిని చేయడానికి సమయం సరిపోవడం లేదు ఇక దాంతో చిన్న వయసులోనే శరీరం మనకు మద్దతు ఇవ్వడం మానేస్తుంది. అయితే కొన్నిసార్లు మనం పూర్తిగా మెడిసిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం.
అయితే ఇలా ఔషధాల మీద ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదని చెప్తున్నారు. నిపుణులు. వంట గదిలోనే ఎన్నో పదార్థాలు ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతున్నాయి. వంటింట్లో ఉండే జీలకర్రతో చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జిలకర బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిత్యం ఖాలి కడుపుతో జీలకర నీటిని ప్రారంభిస్తే ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. శ్వాస కోశ వ్యవస్థ పై ఎఫెక్ట్… జీలకర నీరు శ్వాస కోసం వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. శ్వాస సంబంధిత సమస్య ఏదైనా ఉంటే పరిగడుపున జీలకర నీటిని తీసుకుంటే చాలా మేలు చేస్తుంది.జీలకరతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నప్పటికీ దానిని కూడా పరిమితంగానే తీసుకోవాలి. ఎక్కువ వాడితే కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. రక్తపోటును కంట్రోల్… జీలకర్ర నీటిలో చాలా పొటాషియం ఉంటుంది. నిత్యం జీలకర్ర నీటిని తీసుకోవడం వలన రక్తపోటు ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది.
గర్భిణీలకు : గర్భాధారణ టైంలో జీలకర నీటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. గర్భిణీలు జీలకర్ర నీటిని తాగడం వలన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు జీర్ణ క్రియ కు అవసరమైన ఎంజైములు ఉద్దీపనగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు : మధుమేహాయగ్రస్తులకు జీలకర నీళ్లు చాలా సహాయపడుతుంది. అలాంటి వ్యాధిగ్రస్తులు రోజు ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది… జీలకరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నివేద శక్తిని బాగా పెంచుతుంది. నిత్యం జీలకర నీటిని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా బలంగా తయారవుతుంది. ఎన్నో వ్యాధులతో పోరాటం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు…