Custard Apple Seeds : సీతాఫలం గింజలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!
ప్రధానాంశాలు:
Custard Apple Seeds : సీతాఫలం గింజలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...!!
Custard Apple Seeds : చలికాలం వచ్చింది అంటే చాలు ఎక్కడ చూసినా కూడా సీతాఫలం పండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే రుచిలో అమృతాన్ని తలపించే ఈ సీతాఫలాన్ని తినడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సీజన్ లో దొరికే పండ్లను కచ్చితంగా తీసుకోవాలని తరచుగా నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే కేవలం సీతాఫలం మాత్రమే కాదు దాని యొక్క గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మనం సాధారణంగా సీతాఫలాన్ని గింజలను పారేస్తూ ఉంటాం. కానీ ఈ గింజలలో విటమిన్ ఏ కె సి బి వన్ లాంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే ఈ గింజలలో జింక్ కూడా ఉంటుంది. అలాగే దీనిలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్ లు కూడా ఉన్నాయి. అయితే సీతాఫలం గింజలను తీసుకొని వాటిని బాగా ఎండబెట్టాలి. తర్వాత ఆ గింజలను గ్రైండర్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పొడిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
మీరు ఇలా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండె యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ గింజలలో డైటరీ ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది. అలాగే పేగు యొక్క కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. దీనివలన మలబద్ధక సమస్య అనేది దూరం అవుతుంది. అలాగే ఈ సీతాఫలం గింజలు అనేవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ గింజలలో ఉన్నటువంటి విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది…
మీరు బరువు తగ్గాలి అనుకుంటే ఈ గింజల యొక్క పొడిని కచ్చితంగా తీసుకోవాలి. ఈ గింజలలో ఉండే డైటరీ ఫైబర్ అనేది తొందరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అలాగే ఎముకల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఈ గింజలు ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. అలాగే ఈ గింజలలో ఫాస్పరస్ మరియు మెగ్నీషియం, కాల్షియం లాంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఎముకల యొక్క ఆరోగ్యాన్ని ఎంతగానో రక్షిస్తాయి. ఈ గింజలలో ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ళను ఎంతో బలంగా చేస్తాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యాన్ని రక్షించడం లో కూడా హెల్ప్ చేస్తుంది