Health Benefits : గాడిద పాలతో సబ్బు… నిత్యం యవ్వనంగా ఉంటారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : గాడిద పాలతో సబ్బు… నిత్యం యవ్వనంగా ఉంటారు…

Health Benefits : ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం వివిధ రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే మన చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే గాడిద పాలతో తయారు చేసిన సబ్బు వాడితే మంచి ఫలితం ఉంటుందట. గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టులు వెల్లడించారు. గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. అందువలన గాడిద పాలతో సబ్బులను తయారు చేసి అమ్ముతున్నారు. పైగా ఈ సబ్బులు వాడితో అందంతోపాటు ఎల్లప్పుడూ […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,6:30 am

Health Benefits : ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం వివిధ రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే మన చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే గాడిద పాలతో తయారు చేసిన సబ్బు వాడితే మంచి ఫలితం ఉంటుందట. గాడిద పాలు చాలా మంచివని సైంటిస్టులు వెల్లడించారు. గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయట. అందువలన గాడిద పాలతో సబ్బులను తయారు చేసి అమ్ముతున్నారు. పైగా ఈ సబ్బులు వాడితో అందంతోపాటు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారని ఆ కంపెనీ చెబుతోంది.

పూర్వం ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా కూడా గాడిదపాలతోనే స్నానం చేసేదట. ఇలా గాడిద పాలను స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని చర్మ సంరక్షణ కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ గాడిద పాలతో తయారుచేసిన సబ్బులను అమ్ముతుంది. గాడిద పాల వల్ల చర్మానికి వృద్ధాప్యం రాదని అంటున్నారు. పైగా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.

Health Benefits of donkey milk soap

Health Benefits of donkey milk soap

అందుకనే ఇప్పుడు గాడిద పాలతో తయారు చేయబడిన సబ్బులను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారట. గాడిద పాలలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వలన ఇవి మొటిమలను తగ్గిస్తాయని, ఇన్ఫెక్షన్లు కాకుండా చేస్తాయని అంటున్నారు. మనదేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో గాడిద పాల సబ్బులకు మంచి గిరాకీ ఉందట. ఈ ప్రాంతాల్లోని పలువురు సబ్బులను కాకుండా ఏకంగా గాడిదపాలని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ క్రమంలో ఒక్కో లీటర్ గాడిద పాలు వెయ్యి రూపాయలు పెట్టి మరి కొనుక్కొని తాగుతున్నారట.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది