Garlic Tea : ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగటం వలన ఏడు రకాల ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Garlic Tea : ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగటం వలన ఏడు రకాల ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..!

Garlic Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో వెల్లుల్లి అనేది కచ్చితంగా ఉంటుంది. ఈ వెల్లుల్లిని మాంసాహారం మరియు శాఖాహార వంటకాలలో కూడా వాడుతూ ఉంటారు. అయితే ఈ వెల్లుల్లి లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వెల్లుల్లిని ఖచ్చితంగా నిత్యం తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. సాధారణంగా మనం ఇప్పటి వరకు అల్లం లేక ఇతర రకాల టీలను తాగే ఉంటాం. అయితే కాస్త భిన్నమైన వెల్లుల్లి టీ గురించి […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Garlic Tea : ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగటం వలన ఏడు రకాల ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..!

Garlic Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో వెల్లుల్లి అనేది కచ్చితంగా ఉంటుంది. ఈ వెల్లుల్లిని మాంసాహారం మరియు శాఖాహార వంటకాలలో కూడా వాడుతూ ఉంటారు. అయితే ఈ వెల్లుల్లి లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వెల్లుల్లిని ఖచ్చితంగా నిత్యం తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. సాధారణంగా మనం ఇప్పటి వరకు అల్లం లేక ఇతర రకాల టీలను తాగే ఉంటాం. అయితే కాస్త భిన్నమైన వెల్లుల్లి టీ గురించి మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ప్రయోజనాలు గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే ఈ వెల్లుల్లి టీ తాగడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. నిజానికి ఎంతోమంది వెల్లుల్లి రెబ్బలను మరియు పానీయాలను ఉదయాన్నే తాగుతూ ఉంటారు. అయితే ప్రతినిత్యం కూడా ఉదయాన్నే ఈ వెల్లుల్లి టీ తీసుకుంటే ఎంతో అద్భుతమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక దీనిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి టీ అనేది డయాబెటిస్ కు మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం…

Garlic Tea వెల్లుల్లి టీ తాగటం వలన ఏడు రకాల ప్రయోజనాలు

అవేంటో తెలుసుకోండి : వెల్లులిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. అందుకే దీనిని పవర్ ఫుల్ అని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. కావాలనుకుంటే మీరు వెల్లుల్లి టీలో కొద్దిగా అల్లం మరియు దాల్చిన చెక్కను కూడా వేసుకోవచ్చు. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరగటంతో పాటుగా రుచి కూడా పెరుగుతుంది.

– డయాబెటిస్ పేషెంట్లకు వెల్లుల్లి టీ అనేది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. దీనివలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఇది జీవక్రియ స్థితిలో కూడా హెల్ప్ చేస్తుంది.

– ఈ వెల్లుల్లి టీ ని తీసుకోవడం వలన మన శరీరంలోని మురికిని కూడా తొలగించవచ్చు.

– ఈ వెల్లుల్లి టీతో బరువు కూడా తగ్గవచ్చు. ఈ టీ అనేది మీ శరీరంలోని ఎన్నో భాగాలలో పేరుకుపోయిన కొవ్వును కూడా కలిగిస్తుంది. దీనిలో మెటబాలిజం ను మెరుగుపరిచే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది బరువు తగ్గటానికి కూడా హెల్ప్ చేస్తుంది.

– ఈ వెల్లుల్లి టీ అనేది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిని తీసుకోవడం వలన రక్త ప్రసరణ అనేది ఎంతో మెరుగుపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు అనేవి దరిచేరకుండా ఉంటాయి.

– ఈ వెల్లుల్లి టీ అనేది శ్వాస కోశ వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. అలాగే శీతాకాలంలో వచ్చే జలుబు మరియు దగ్గును కూడా దూరం చేస్తుంది.

– ఈ టీ అనేది ఒక శక్తివంతమైన యాంటీబయోటిక్ పానీయమని చెప్పొచ్చు. ఇది శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

Garlic Tea ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగటం వలన ఏడు రకాల ప్రయోజనాలు అవేంటో తెలుసుకోండి

Garlic Tea : ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగటం వలన ఏడు రకాల ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..!

– ఈ వెల్లుల్లి టీ శరీరంలోని మంటను కూడా నియంత్రిస్తుంది.

వెల్లుల్లి టీ ఎలా తయారు చేసుకోవాలి : వెల్లుల్లి టీ ని ఎలా తయారు చేయాలి అంటే ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. దానిలో ఒక కప్పు వాటర్ పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వెల్లుల్లి దంచి దీనిలో వెయ్యాలి. దీనితో పాటుగా ఒక చెంచా నల్లమిరియాలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని ఆ టీ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మీరు వెల్లుల్లి టీ ని తయారు చేసుకొని తాగొచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది