Garlic Tea : చలికాలంలో వచ్చే సమస్యలకు .. వెల్లుల్లి టీతో చెక్ పెట్టండి ఇలా ..!
Garlic Tea : చలికాలంలో వెల్లుల్లి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే వెల్లుల్లి తినడం వలన శరీరాన్ని వేడి కలుగుతుంది. అలాగే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే చలికాలంలో అల్లం టీ తోపాటు వెల్లుల్లి టీ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చలికాలంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి. వెల్లుల్లిలో విటమిన్ సి, సెలీనియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, రైబో ఫ్లైవిన్ వంటి మూలకాలు ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి.
ఇది అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కాబట్టి చలికాలంలో వెల్లులి టీ తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1) చలికాలంలో జలుబు, దగ్గు అనేది సర్వసాధారణమైన సమస్య. అయితే జలుబు, దగ్గు ఉన్నప్పుడు వెల్లుల్లి టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీబయాటిక్ గుణాలు దగ్గు, జలుబు సమస్యలను దూరం చేస్తాయి.2) ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ ని తీసుకోవడం వలన శరీరంలో ట్యాక్సిన్ తొలగిపోతుంది. ఎందుకంటే ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ ని తీసుకోవడం వలన శరీరం డిటాక్సిఫై అవుతుంది. దీనివలన చర్మానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
అలాగే చర్మం కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.3) వెల్లుల్లి టీ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివలన శరీరం వైరస్, బ్యాక్టీరియాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 4) వెల్లుల్లి టీ తీసుకోవడం వలన పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే వెల్లులి టీ తీసుకోవడం వలన జీవ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనివలన జీర్ణ క్రియకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి.