Carrot Juice : ఈ కాలంలో ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంతం…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Carrot Juice : ఈ కాలంలో ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంతం…??

 Authored By ramu | The Telugu News | Updated on :14 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Carrot Juice : ఈ కాలంలో ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు... నమ్మలేని లాభాలు మీ సొంతం...??

Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు చూసినా కూడా పండ్లు మరియు కూరగాయలు తాజాగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలలో క్యారెట్ కూడా ఒకటి. అయితే ఈ క్యారెట్ లో విటమిన్ సి అధికమో తాదులో ఉంటుంది. వీటితో జ్యూస్ చేసి తీసుకోవటం వలన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో సగం అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా విటమిన్ సి రక్షిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం టైమ్ లో రోజు క్యారెట్ జ్యూస్ తాగటం వలన అలసట లేకుండా ఎంత యాక్టివ్ గా ఉంటారు…

శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ మరియు వ్యర్థాలను బయటకు పంపించడంలో కూడా ఈ జ్యూస్ ఎంత చక్కగా పనిచేస్తుంది. అలాగే క్యారెట్ లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది. దీనిలో బీటా కెరోటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాక ఎటువంటి కంటి సమస్యలు దరిచేరకుండా కూడా రక్షిస్తుంది. అలాగే వీటిని మానవ శరీరం విటమిన్ ఎ కిందకు మారుస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయగలదు. అలాగే క్యారెట్ లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కూడా కాపాడుతుంది. చలి కాలంలో ఎక్కువగా వేధించే జలుబు మరియు దగ్గు, ఫ్లూ లాంటి సమస్యల నుండి కూడా కాపాడుతుంది. ఈ సీజన్ లో రోజు క్యారెట్ జ్యూస్ ను తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు…

Carrot Juice ఈ కాలంలో ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు నమ్మలేని లాభాలు మీ సొంతం

Carrot Juice : ఈ కాలంలో ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంతం…??

క్యారెట్ లో ఉన్నటువంటి పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. ప్రతిరోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే క్యారెట్ లో ఉండే విటమి సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి చర్మం నాచురల్ కాంతివంతంగా ఉండేలా కూడా చేస్తాయి. అలాగే చర్మం మృదువుగా ఉండడంతో పాటుగా ఇటువంటి ముడతలు మరియు మొటిమలు లేకుండా చూస్తుంది. యవ్వనంగా కనిపించే చర్మాన్ని కూడా ఇస్తుంది. అలాగే మొటిమలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ ని తీసుకోవడం వలన మీ శరీరానికి నాచురల్ గ్లో అనేది వస్తుంది. దీనిలో ఉన్న ఫైబర్ వలన కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. దీని వలన చిరుతిండ్లు తినకుండా ఉంటారు. ఇది బరువు ను తగ్గించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే క్యారెట్ లో పొటాషియం అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటుగా జ్ఞాపకశక్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ క్యారెట్ జ్యూస్ చక్కగా పని చేస్తుంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది