Health Benefits : ఈ నాలుగు పప్పులు చాలు… గుండె పదికాలాలు ఆరోగ్యంగా ఉన్నట్లే…!
Health Benefits : మానవ శరీరంలో అన్ని అవయవాల కన్నా గుండె చాలా ముఖ్యమైనది. అలాంటి గుండెకు ప్రస్తుత కాలంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. మరి ఆ గుండె పదికాలాలు చల్లగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తినాలి. బాదంపప్పు, మేకడిమియా నట్స్, హజల్ నట్స్, పీకాల్ నట్స్ ఈ నాలుగు నట్స్ గుండెకు చాలా మంచిది. వీటిలో 50 శాతం కన్నా పైన కొవ్వు ఉంటుంది. ఎందుకంటే వీటిలో స్యాచురేట్ ఫ్యాట్ తక్కువ, అన్ స్యాచురేటెడ్, మోనో స్యాచురేటెడ్ ఫ్యాట్ ఈ రెండు రకాల కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బాదంపప్పులలో మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 32 గ్రామ్స్ ఉంటుంది. పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 12 గ్రామ్స్ ఉంటుంది.
మేకడమియా నట్స్ ఇందులో మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 59 గ్రామ్స్, పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. హజల్ నట్స్ తీసుకుంటే మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 46 గ్రామ్స్ పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 8 గ్రామ్స్, పీకాల్ నట్స్ లో మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 41 గ్రామ్స్, పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 22 గ్రామ్స్ ఇవి ఈ నాలుగు పప్పులలో ఉండే గుండెకు ప్రయోజనాలను కలిగించి కొవ్వుల శాతాలు. ఎంత ఫాట్ ఉన్న నట్స్ తీసుకున్న కూడా గుండెకు ఎటువంటి హాని కలగదు. ఎందుకంటే ఇవి స్లోగా అరుగుతాయి. వీటిని ఎక్కువగా తినలేము. ఎందుకంటే వేగటుగా ఉంటాయి కాబట్టి. అందువల్ల ఎక్కువ తినలేం.
ఈ పప్పులను ఉత్తిగా తినలేము కాబట్టి నానబెట్టుకొని తినాలి. ఇక వీటిని తిన్నప్పుడు కూడా స్లోగా జీర్ణం అవుతుంది. వీటివల్ల హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది ఇది గుండెకు చాలా మంచిది. లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేలా చేస్తుంది. అందుకనే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఈ నాలుగు నట్స్ ను తినాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కార్బోహైడ్రేట్స్, వైట్ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ లాంటివి తగ్గిస్తే తగ్గిపోతుంది.కాబట్టి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి ఈ నాలుగు పప్పులు బాగా ఉపయోగపడతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినాలి. వీటిని 12 గంటలు నానబెట్టి తినాలి.