Honey And Turmeric : పసుపు, తేనె ను కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!
Honey And Turmeric : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యం పై ఎంతో అవగాహన పెరుగుతుంది. అలాగే ఎంతోమంది ఆయుర్వేద విధానాలను ఫాలో అవుతూ ఉన్నారు. అంతేకాక ఇంట్లో దొరికే సహజ చిట్కాలను కూడా పాటిస్తున్నారు. అయితే పసుపు మరియు తేనే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. అయితే ఇంతకీ ఈ రెండిటిని కలిపి […]
ప్రధానాంశాలు:
Honey And Turmeric : పసుపు, తేనె ను కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...!!
Honey And Turmeric : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యం పై ఎంతో అవగాహన పెరుగుతుంది. అలాగే ఎంతోమంది ఆయుర్వేద విధానాలను ఫాలో అవుతూ ఉన్నారు. అంతేకాక ఇంట్లో దొరికే సహజ చిట్కాలను కూడా పాటిస్తున్నారు. అయితే పసుపు మరియు తేనే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. అయితే ఇంతకీ ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– పసుపు మరియు తేనే మిశ్రమం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది అని నిపుణులు అంటున్నారు. ఈ మిశ్రమం సహజ సిద్ధమైన లక్సెటివ్ ఏజెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇది సుఖ విరోచనాలాకి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. అంతేకాక కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ లాంటి సమస్యలను కూడా నయం చేయటంలో బెస్ట్ గా పని చేస్తుంది…
– రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ మిశ్రమం ముఖ్య పాత్ర పోషిస్తుంది అని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉన్న విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాక దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలను నాశనం చేయగలవు. అలాగే పసుపు మరియు తేనె కలిపి తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. అలాగే సిజనల్ వ్యాధులు అయినటువంటి దగ్గు మరియు జలుబు నుండి కూడా ఉపశమనం కల్పించడంలో ఇవి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి..
– కీళ్ల నొప్పుల సమస్యలను నయం చేయటంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే నొప్పులు మరియ వాపుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే అర్థరైటీస్ నొప్పులు ఉన్నటువంటి వారు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి కీళ్ళు మరియు మోకాలు నొప్పులను కూడా దూరం చేస్తాయి…
– ఈ మిశ్రమం చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే ముడతలు మరియు మొటిమలు, మచ్చలు అనేవి తగ్గుతాయి. దీంతో ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. అంతేకాక చర్మం ఎంతో ప్రకాశిస్తుంది మరియు యవ్వనంగా కూడా కనిపిస్తుంది…
-మెదడు ఆరోగ్యాన్ని రక్షించటంలో కూడా ఈ మిశ్రమం ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీంతో మతిమరుపు కూడా తగ్గుతుంది. అలాగే జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత కూడా పెరుగుతాయి. అలాగే మానసిక సమస్యలను నయం చేయటంలో కూడా ఈ మిశ్రమం ప్రధాన పాత్ర పోషిస్తుంది అని నిపుణులు అంటున్నారు