Health Benefits : ఈ మొక్కని ఇంట్లోనే పెంచుకోండి.. దీని ఆకులతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలిస్తే వదలరిక..
Health Benefits : కుప్పింటాకు గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కవగా ఈ కుప్పింటాకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కుప్పింటాకు ఎన్నో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల రసం ద్వారా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేయవచ్చు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి కుప్పింటాకు రసం తీసుకుంటే క్షణాల్లో ఉపషమనం లభిస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
అలాగే కాలిన గాయాలకు కూడా కుప్పింటాకును మొత్తగా పెస్టులా చేసి అందులో పసుపు కలిపి రాస్తే వెంటనే తగ్గిపోతాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ కుప్పింటాకు దివ్యఔషదంలా ఉపయోగపడుతుంది. పంటి నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారకుండా నివారిస్తుంది. అలాగే దంతాలు తెల్లగా మారడానికి తోడ్పడుతుంది. కుప్పింటాకు రసంలో పసుపు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట రాస్తే ఉపషమనం లభిస్తుంది.కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆకుల రసంలో కొబ్బరినూనెతో కలిపి వేడి చేసుకుని రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గిపోతాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి.
అలాగే కడుపు నొప్పి సమస్యను కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ ఆకులతో చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కుప్పింటాకులను పేస్టుల తయారు చేసుకుని అందులో పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు మచ్చలు తొలిగిపోతాయి.అలాగే ఈ ఆకులను విష పురుగులు కాటేసినప్పడు విరుగుడుగా ఉపయోగిస్తారు. పాము,తేలు వంటి విషపు పురుగులు కాటేస్తే ఈ ఆకులలో మిరియాలు కలిపి తమలపాకుతో కట్టుగా కడతారు. అలాగే దురద సమస్య ఉంటే ఈ ఆకులను ఉప్పుతో కలిపి రాస్తే సమస్య పోతుంది. ఈ ఆకుల రసాన్ని తాగితే మలబద్దకం సమస్యను కూడా దూరం చేయవచ్చు.