Health Benefits : ఈ ఆకు గురించి తెలిస్తే మీరు చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టి మరీ ఇంటికి తెచ్చుకుంటారు ..!!
Health Benefits : ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహజ సిద్ధంగా దొరికే ఔషధాల మొక్కల గురించి తెలుసుకొని వాటిని ఉపయోగించి చాలా వరకు రోగాలను తగ్గించుకుంటున్నారు. మన చుట్టూ దొరికే ఎన్నో రకాల మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒకటే బొప్పాయి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోగాలకు బొప్పాయిని ఔషధంగా వాడుతారు. మరీ ముఖ్యంగా బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఆయుర్వేద మందులకు దీనిని ఎక్కువగా వాడతారు.
క్యాన్సర్ రాకుండా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుంది. అలాగే సౌందర్య సాధనలో కూడా బొప్పాయి మనకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయి ఆకుల రసం జుట్టుకు రాస్తే నిగనిగలాడుతుంది. జుట్టును బలంగా, దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయి ఆకుల రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మహిళలు రుతుక్రమ సమస్యలు కూడా తగ్గుతాయి. బొప్పాయి రసాన్ని పరిగడుపున తాగితే తిన్నది త్వరగా అరుగుతుంది.