Red Leaves : ఎర్ర తోటకూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Red Leaves : ఎర్ర తోటకూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Red Leaves : ఎర్ర తోటకూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!

Red Leaves : మన రోజువారి జీవితంలో మన ఆరోగ్యం కోసం ఆకు కూరలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆకుకూరలు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దాదాపుగా అందరికీ తెలుసు. ఈ ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాంటి ఆకుకూరలు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో ఎర్రతోట ఆకుకూర కూడా ఒకటి. ఈ ఎర్ర తోటకూరను తీసుకోవటం వలన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకు కూరను తినటం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ ఎర్ర తోటకూరలో విటమిన్ సి, విటమిన్ ఇ,విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,ఫాస్ఫరస్, కాపర్, జింక్,ఐరన్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి ఎర్ర తోటకూర ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వారానికి ఒకటి రెండు సార్లు ఈ ఎర్ర తోటకూరను తిన్నట్లయితే దీనిలో ఉంటే కాల్షియం ఎముకలను మరియు దంతాలను దృఢంగా తయారు చేసేందుకు సహాయపడుతుంది…

ఈ ఎర్ర తోటకూరలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక రక్త ప్రసరణ కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి చెడు కొలేస్ట్రాల్ కూడా తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఈ ఎర్ర తోటకూరను డయాబెటిస్ వున్నవారు తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే కంటి సమస్యలు అనేవి తగ్గి కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. కావునా ఎముకల ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. అలాగే ఈ ఎర్ర తోటకూరలో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. కావున దీనిని తీసుకోవడం వలన రక్తహీనత సమస్య ఉండదు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాక ఎన్నో రకాల వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది.

Red Leaves ఎర్ర తోటకూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Red Leaves : ఎర్ర తోటకూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

ఈ ఎర్ర తోటకూర రక్త పోటు స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అయితే ఈ ఎర్ర తోటకూరను తీసుకోవడం వలన గుండెపోటు మరియు ఇతర గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పని తీరు కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక గర్భిణీలకు కూడా ఈ ఎర్ర తోటకూర ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ ఎర్ర తోటకూరను ప్రతినిత్యం తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ ఎర్ర తోటకూర అనేది ఊబకాయానికి మంచి నివారణ అని చెప్పొచ్చు. అలాగే స్థూలకాయన్ని నియంత్రించడంలో కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. దీనిలో ఉన్నటువంటి కాల్షియం ఎముకలు మరియు దంతాలను దృఢంగా చేస్తాయి. అంతేకాక సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడ గల శక్తని కలిగి ఉంది. అలాగే గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఈ ఎర్ర తోటకూర సహాయం చేస్తుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది