Health Benefits : ఈ పొడిని పాలలో కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడమే కాదు.. ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు.
Health Benefits : ప్రస్తుతం ఉన్న జీవనశైలి విధానంలో ఉద్యోగ రీత్యా, ఉరుకుల బేరుకుల జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఒత్తిడిలు, హార్మన్ సమస్యలు వలన చిన్న వయసులో కూడా అధికంగా బరువు పెరిగిపోతూ దాని గురించి ఎంతో ఇబ్బంది పడుతూ.. దాని కొరకు ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. ఇలా వాడడం వలన ఎటువంటి ప్రయోజనం కలగదు.. అయితే ఈ అధిక బరువు తగ్గడానికి ఈ పొడిని పాలలో కలిపి త్రాగడం వలన మంచి ఉపశమనం […]
Health Benefits : ప్రస్తుతం ఉన్న జీవనశైలి విధానంలో ఉద్యోగ రీత్యా, ఉరుకుల బేరుకుల జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఒత్తిడిలు, హార్మన్ సమస్యలు వలన చిన్న వయసులో కూడా అధికంగా బరువు పెరిగిపోతూ దాని గురించి ఎంతో ఇబ్బంది పడుతూ.. దాని కొరకు ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. ఇలా వాడడం వలన ఎటువంటి ప్రయోజనం కలగదు.. అయితే ఈ అధిక బరువు తగ్గడానికి ఈ పొడిని పాలలో కలిపి త్రాగడం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని వాడడం వలన అధిక బరువు తగ్గడమే కాదు.. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పొందవచ్చు.. అసలు ఈ పొడి ఏంటో.? ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాన్లో ఒక అంగుళం దాల్చిన చెక్క, ఒక స్పూన్ మిరియాలు, ఐదు యాలకులు, ఒక స్పూన్ సోంపు గింజలు, ఒక స్పూను వాము వేసి మంచి సువాసన వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పొడిలా చేసుకోవాలి.తర్వాత దీంట్లో ఆర్గానిక్ పసుపు ఒక చెంచా, మూడు చెంచాల బాదంపోడి, ఒక చెంచా సొంటి పొడి, ఒక చెంచా అశ్వగంధ పొడి అలాగే రుచి కోసం పట్టిక బెల్లాన్ని కూడా వేసి మరొకసారి మిక్సీ వేసుకోవాలి. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి ఫ్రిజ్లో ఉంచుకోవచ్చు. ఈ పొడి సుమారు నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఈ పొడిని ఒక కప్పు గోరువెచ్చని పాలలో అర చెంచా పొడి వేసి కలుపుకొని ఉదయం టైంలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నిద్రలేని సమస్య ఉన్నవారు ఈ పాలని నైట్ పడుకునే సమయంలో తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మోకాళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి. జలుబు, దగ్గు లాంటి సీజనల్ జబ్బులు రాకుండా రక్షిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ బాగా అందుతుంది. అదేవిధంగా ఎముకలు, కండరాలు బలంగా ఉండడానికి ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది.