Health Benefits : తెల్ల ఉల్లితో ఈ వ్యాధులకు చెక్.. అది ఎలాగో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : తెల్ల ఉల్లితో ఈ వ్యాధులకు చెక్.. అది ఎలాగో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

 Authored By rohini | The Telugu News | Updated on :27 June 2022,5:00 pm

Health Benefits : ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో టెక్నాలజీలు లను వాడుతున్నారు. ఏ పని చేయాలి అన్న ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతుంటారుఅందరూ ఈ జెనరేషన్ వాళ్ళు ఉద్యోగరీత్యా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారు మొబైల్స్ కంప్యూటర్లు లాప్ టాప్ వీటిలోనే ఎన్నో వర్కులు చేస్తున్నారు. గంటలు గంటలు ఈ పరికరాల వద్ద కూర్చొని ఉంటూ ఉంటారు. అలా కూర్చోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా ఎక్కువగా మొబైల్స్ వాడటం వల్ల వారికి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటి వలన వచ్చే అనారోగ్య సమస్యలు కంటిచూపు తగ్గిపోవడం కంటి వెంట నీరు కారడం, గ్యాస్ సమస్యలు నిద్ర లేని సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తున్నాయి.

వీటి స్క్రీన్ చూస్తూనే గంటలు గంటలు ఉండిపోవడం వలన ఇలాంటి సమస్యలు అన్ని వస్తున్నాయి. కంటిలో నరం దెబ్బతింటుంది. అయితే ఇలాంటి సమస్యలు దూరం అవ్వాలి అంటే. తెల్ల ఉల్లి తో ఇలా చేయడం వల్ల తగ్గిపోతాయి అంటున్నారు వైద్య రంగం ఉల్లి లేని కూర ఉండదు తల్లి లేని బిడ్డ ఉండదు అనే సామెత లాగానే మన ఆరోగ్యంగా ఉండడానికి ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉల్లిగడ్డను మనం ప్రతి కూరలో వాడుతూ ఉంటాను. మనకు వచ్చే వ్యాధులకు నివారణ ఈ ఉల్లి తోనే అవుతుంది. అవి ఏంటో చూద్దాం. ఉల్లి వలన ఇన్ని లాభాలా.. ఉల్లిలో ఎన్నో పోషకాలు ఉంటాయి పొటాషియం కూడా బాగా ఉంటుంది. ఈ తెల్ల ఉల్లిగడ్డ మనకు ఎక్కువగా ఎండాకాలంలో మాత్రమే మే అందుబాటులో ఉంటుంది. దీనిని ఎక్కువగా పచ్చిగా తీసుకోవడం వలన మన శరీరంలో వేడిని తగ్గించి మన శరీరాన్ని చలువ పరుస్తుంది.

Health Benefits of white onions

Health Benefits of white onions

మన శరీరం అలసట నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి హైపర్ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటివారు ఉల్లిని ఎక్కువగా తింటూ ఉండాలి. ఈ ఉల్లి కంటి చూపు కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉల్లి ఉదయం కొన్ని వాటిల్లోనూ పచ్చిగా తినడం వల్ల నీరసం కంటి వెంట నీరు కారడం ,చిన్న అక్షరాలు కనిపించని వారు ,ఇలా చేయడం వల్ల మంచి మేలు జరుగుతుంది. ఈ ఉల్లిపాయలను రోజువారి ఆహారం లో పచ్చి వాటిని ఎక్కువగా వాడడం వలన ఉదర సమస్యలు అంటే గ్యాస్ ,కడుపు ఉబ్బరం, అన్నం అరకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ ఉల్లిలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. మన శరీరంలోని బోన్స్ ను మజిల్స్ ను గట్టి పరచడానికి ఈ ఉల్లి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి తెల్ల ఉల్లిని ఉపయోగించి అందరం ఆరోగ్యంగా ఉందాం.

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది