Health Benefits : వర్షాకాలంలో వేడి నీటి ఆవిరి పట్టడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయ..
Health Benefits : ఆషాడ మాసం వచ్చేసింది ఈ మాసం మొత్తం వర్షాలు బాగా కురుస్తూ ఉంటాయి. అయితే ఈ వర్షాలు వల్ల వర్షపు నీరు ఎక్కడపడితే అక్కడ ఆగుతుంటాయి. ఆ ఆగిన నీళ్లలో ఎన్నో రకాల దోమలు తయారవుతూ ఉంటాయి. ఆ దోమలు మనకు కుట్టడం వలన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎన్నో వ్యాధులు బారిన పడుతూ ఉంటారు. అలాగే వాతావరణం లో మార్పుల వలన కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది . అలా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఎక్కువగా వచ్చే జబ్బులు జలుబు, దగ్గు ,ఆస్తమా ,నిమ్ము లాంటివి బాగా వస్తుంటాయి. ఉష్ణోగ్రతలో మార్పుల వలన మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
దీని కారణంగా ఉదయం లేచిన దగ్గర్నుంచి పదేపదే తుమ్ములు వస్తూ ఉంటాయి ఈ తుమ్ములు మనకు ఎంతో ఇరిటేషన్ కలిగిస్తుంటాయి. ఈ జలుబు వలన ముక్కులలోని నాళాలు మూసుకుపోతుంటాయి ఇలా మూసుకుపోవడం వలన శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది గురవుతుంటారు అలాగే ఈ జలుబు తీవ్రత ఎక్కువైతే దగ్గు కూడా వస్తుంది. ఇలా ఎక్కువ రోజులు ఉండడం వలన శరీరంలోని నిమ్ము అస్తమా లాంటి దీర్ఘకాలపు వ్యాధులుగా మారుతూ ఉంటాయి. ఇలా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఇంట్లోనే వేడి నీళ్ల ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. వేడినీళ్ల ఆవిరిని ప్రతిరోజు మూడుసార్లు పడుతూ ఉండాలి ఇలా ఆవిరి పట్టడం. వలన ముక్కులో మూసుకుపోయిన శ్లేష్మాలు చాలా ఫ్రీ అవుతాయి.
శ్వాస తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలా ఆవిరి తీసుకోవడం వలన గొంతులో నొప్పికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దగ్గు కూడా తగ్గిపోతుంది అలాగే చాతిలో శ్లేష్మేలు కూడా గడ్డ కట్టకుండా ఉపయోగపడుతుంది. హస్తమా నిమ్ము లాంటి వ్యాధులు తగ్గిపోతాయి ఇలా ఆవిరి పట్టడం వలన ఈ వ్యాధులన్నీ తగ్గిపోవడమే కాదు మన శరీరంపై ఉండే రంధ్రాలు మట్టితో మూసుకుపోతూ ఉంటాయి. దానివలన మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే శరీర రంధ్రాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవాలంటే అప్పుడప్పుడు బాడీ స్టీమ్ కూడా పట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ వర్షాకాలంలో రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.