Health Benefits : శరీరంలో ఉన్న అన్ని భాగాలను చల్లబరిచే ఈ జ్యూస్ గురించి తెలుసా?
Health Benefits : వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరంలోని వేడి తాపాన్ని తగ్గించుకునేందుకు చాలా కష్టపడుతుంటాం. ఎన్నో రకాల జ్యూస్ లతో పాటు కూల్ డ్రింక్స్ తాగుతూ కాస్త ఉపశమనం పొందుతుంటాం. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం చల్ల చల్లగా ఉండే వాటితో పాటు కొబ్బరి బోండాలు తాగుతుంటాం. ఇవే కాకుండా సుగంధ పాలు కూడా ఎక్కువగా తాగుతుంటాం. అందులోనూ వేసవి కాలంలో భారతీయులు మరింత ఎక్కువగా తాగుతున్నారని పోలాండ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఒరిస్సా వారు తెలిపారు. 2012లో చేసిన ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సుగంధలో నలభైకి పైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే చాలా ఎక్కువ. వేసవి కాలంలో రిలీజ్ అయ్యే వేస్ట్ కెమికల్స్ అన్నింటిని వాటర్ సాలిబుల్ కెమికల్ గా మార్చేందుకు ఈ యాంటీ యాక్సిడెంట్స్ బాగా పని చేస్తాయి. ముఖ్యంగా లివర్ ను యాక్టివ్ చేసి యూరిన్ ద్వారా 80 నుంచి 90 శాతం బయటకు పోయేట్లు చేస్తుంది. అంతే కాకుండా బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు హైడ్రేట్ చేయడానికి ఈ సుగంధ వేర్లు బాగా ఉపయోగపడతాయి. ఇలా శరీరాన్ని తల్లబరిచే గుణం దీనిలో ఉండబట్టే వేసవి కాలంలో ఈ సుగంధ పాలను తీసుకోవడం వల్ల హాయిగా అనిపిస్తుంది.
అయితే మన శరీరంలోని లివర్ లో ఉన్న వేస్టేజీని ఫేజ్ 1, ఫేజ్ 2 లో వేరు చేసి ఫేజ్ 3 లోకి పంపి యూరిన్ ద్వారా బయటకు పంపుతుంది. అందువలన సుగంధ పాలు తీసుకోవడం చాలా మంచిది. కాకపోతే బయట అమ్మేవారు సుగంధ ఫ్లేవర్ కోసం ఏదో కొంచెం మాత్రమే కలుపుతారు. దాని వల్ల అంత లాభం ఉండదు కాబట్టి మనమే మనింట్లో ఈ సుగంధ పాలను తయారు చేసుకుంటే మరింత మంచిది.కుండలో ఉన్న చల్లటి పాలలో కొంచెం తేనేను మరియు సుగంధ పొడిని కలుపుకొని ఈ పాలను తాగడం మంచిది. ఇలా ప్రతిరోజూ తాగడం పైన ఛెప్పుకున్న అన్ని ప్రయోజనాలను మనం పొందవచ్చు, అయితే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. అంతే కాకుండా ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది. అలాగే డీహైడ్రేషన్ ని తగ్గిస్తుంది.