Tooth Pain : జామ ఆకుల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.. పంటి నొప్పిని ఇట్టే మాయం చేస్తాయి..
Tooth Pain : కొన్ని ఇంటి చిట్కాలు డాక్టర్ల మందుల కంటే కూడా ఎక్కువగా మంచి ఫలితాన్ని అందిస్తాయి. వంటింటి చిట్కాలు ఆయుర్వేదం కావడంతో… ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్య దూరం అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధ పడుతున్నారు. ఇలాంటి చాలా నొప్పులకు మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. అయితే ఈ అలవాట్ల వల్ల వచ్చే సమస్యల్లో పంటి నొప్పి ఒకటి. ఈ నొప్పి కారణంగా కొద్దిగా కూడా ప్రశాంతంగా ఉండలేము. ఇష్టమైన ఆహారం తినలేము. చల్లని వస్తువులకు పూర్తిగా దూరం ఉండాల్సిన పరిస్థితిలో పడిపోతాం.ఈ సమస్యలకు పరిష్కారమే జామ ఆకులు. జామ ఆకులు పంటి నొప్పులకు త్వరగా, స్వల్ప కాలిక ఉపశమనాన్నిఅందిస్తాయి. లేత జామ ఆకును ఎంచుకుని నమలడం లేదా ఆకుల కషాయం చేసుకుని తాగితే పంటి నొప్పుల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.
జామ ఆకులను నీటిలో మరగబెట్టి, మరిగించిన ద్రావణంలో ఉప్పు వేసి మౌత్ వాష్ గా కూడా ఉపయోగించవచ్చు. చిగుళ్ల వ్యాధి వంటి నోటి సంబంధిత ఇన్ఫెక్షన్లను అన్నింటినీ తగ్గించటంలో జామ ఆకులు ఎంతో సమర్థవంతంగాపని చేస్తాయి.లేత జామ ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. ఆ కడిగిన ఆకులను నోట్లో వేసుకుని కచ్చా పచ్చా నమలండి. ఇలా నమిలితే ఆకులోని రసం నోట్లోకి వస్తుంది. ఈ రసాన్ని ప్రతి పంటికి తగిలేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఓ ఐదు నిమిషాలు వేచి చూడాలి. అనంతరం ఆ రసాన్ని గార్గిల్ చేస్తూ బయటకు ఉంచేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పంటి నొప్పుల నుండి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.జామ ఆకుల్లోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం అందిస్తుంది.
జామ ఆకులు నోటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జామ ఆకులను నమలడం అందరికీ కుదరక పోతే… అలాంటప్పుడు జామ ఆకు మౌత్ వాష్ చేయవచ్చు. అధ్యయనాల ప్రకారం, జామ ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. జామ ఆకుల మౌత్ వాష్ చిగుళ్ల వాపును తగ్గించడంలో మరియు ఫలకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జామ ఆకులతో మౌత్ వాష్ ను సిద్ధం చేయడానికి, మొదట 5-8 లేలేత జామ ఆకులను మెత్తగా చూర్ణం చేసి, 1 గ్లాసు వేడి నీటితో కలపాలి. ఆ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు బాగా మరగబెట్టాలి. తరువాత మెల్లిగా చల్లబరచాలి. కొంచెం ఉప్పు కలిపి… ఆ రసాన్ని మౌత్ వాష్‌గా వాడొచ్చు. ఈ రసం పంటి నొప్పిని ఎదుర్కోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. మౌత్ వాష్ ఇంట్లోనే తయారయిపోతుంది.