Health Benefits : ఈ జెల్ జీరా పౌడర్ ని తయారు చేసుకోవడం ఎలా? అలాగే దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి…
Health Benefits : వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధులు జలుబులు, దగ్గులు జ్వరాలు, అలాగే కడుపునొప్పి, జీర్ణ సంబంధిత వ్యాధులు ఇలా వస్తుంటాయి. ఇది చిన్న పిల్లలలో ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు చిన్నపిల్లలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కొన్ని ఇంగ్లీష్ మందులు కూడా వాడుతూ ఉంటారు అవి వాడిన ఈ వ్యాధులు తగ్గే అవకాశాలు పెద్దగా ఉండవు. అలాంటి టైంలో మనం ఈ జెల్ జీరా పౌడర్ ను చేసుకొని దీనిని వాడడం వలన, ఇలాంటి అన్ని వ్యాధులు తగ్గిపోతాయి. అయితే ఈ జల్ జీరా పౌడర్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం..
దీనికి కావలసిన పదార్థాలు: 1)జీలకర్ర 2)మిరియాలు 3) ఆంసూర్ పౌడర్4) బ్లాక్ సాల్ట్ 5)చాట్ మసాలా6) సాల్ట్ 7)ఇంగువ 8)పంచదార పొడి 9)పుదీనా 10)నిమ్మకాయ 11)అల్లం మొదలైనవి. తయారీ విధానం : మీద ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు ఒక ముక్క సొంటి వేసి వీటిని లో ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దింపి చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చుకున్న మిశ్రమంలో లోకి ఒక స్పూన్ ఆంసూర్ పౌడర్, ఒక స్పూను బ్లాక్ సాల్ట్ ,ఒక స్పూన్ చాట్ మసాలా, అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ ఇంగువ, రెండు స్పూన్ల పంచదార పొడి, వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి.
అంతే జెల్ జీరా పౌడర్ రెడీ. దీంతో డ్రింక్స్ తయారు చేయడం ఎలా చూద్దాం.. ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని ఒక చిన్న అల్లం ముక్కను, అలాగే పుదీనా నాలుగాకులు వేసి కచ్చాపచ్చాగా దంచుకుని ఒక గ్లాసులో వేసి దానిలో ఈ జల్ జీరా పౌడర్ ను రెండు స్పూన్లు వేసుకొని దానిలో కొంచెం హాట్ వాటర్ వేసుకొని బాగా కలిపి చిన్న పిల్లలు గాని పెద్ద వాళ్ళు గాని త్రాగడం వలన జలుబులు , దగ్గులు,జ్వరాలు ఇలాంటివి తొందరగా తగ్గుతాయి. అలాగే మజ్జిగలో ఈ పొడిని ఒక స్పూన్ తో కలిపి తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అలాగే మలబద్ధక సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ డ్రింక్ సమ్మర్ సీజన్లో తీసుకోవడం వలన మీ కడుపు కు చల్లదనాన్ని మెరుగుపరుస్తుంది.