Health Problems : సీజన్ కదా అని సీతాఫలం ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ సమస్య బారిన పడినట్లే…
Health Problems : సీతాఫలం కేవలం శీతాకాలంలో మాత్రమే దొరుకుతుంది. సీతాఫలం మంచి రుచిని అందించే మధురమైన పండు. సీతాఫలం మంచి రుచిని అందించడమే కాదు శరీర పెరుగుదలకు కావలసిన పోషకాలను అందిస్తోంది. అందుకే దీన్ని సూపర్ ఫ్రూట్ గా పరిగణిస్తారు. అలాగే సీతాఫలం చెట్టులోని ఆకులు, బెరడు, వేర్లు ఇలా ప్రతి భాగంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలు శరీరంలో వ్యాధి కారకాలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. సీజనల్ గా లభించే సీతాఫలం ప్రతిరోజు తినడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సీతాఫలం పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కావున ప్రతిరోజు ఈ పండుని తినడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను ఈ సీతాఫలం పండ్లతో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.సీతాఫలం పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీని ద్వారా అనీమియా వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు లభిస్తాయి. ఆపిల్, జామ, మామిడి బొప్పాయి బత్తాయి వంటి పండ్లతో పోలిస్తే అందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవారు ప్రతిరోజు సీతాఫలాన్ని ఆహారంగా తీసుకుంటే శరీరానికి శక్తి నిచ్చి బరువు పెరగడంలో సహాయపడుతుంది. సీతాఫలం గుజ్జులో అధికంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటుకు దూరంగా ఉంచుతుంది.
సీతాఫలం పండులో నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు దీర్ఘ కాయ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. సీతాఫలం పండులో ఎసిటోజెనిన్ కెమికల్స్ చర్మ క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. అలాగే ఈ పండులో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. సీతాఫలంలో అత్యధిక క్యాలరీలు ఉండడం వలన అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తినకూడదు. ఎక్కువగా తింటే క్యాలరీలు ఎక్కువగా ఉండడం వలన మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను అతిగా తినకపోవడం మంచిది.