Health Problems : చికెన్ తో ఇవి కలిపి తింటే… ఆరోగ్యానికి హానికరం…
Health Problems : ఈరోజుల్లో చాలామంది నాన్ వెజ్ ను తినడానికి ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా చికెన్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే చికెన్ లో కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినకూడదు. చికెన్ తో కొన్ని ఆహారాలను తినడం వలన శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. కొన్ని ఆహారాలను చికెన్ తో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతోపాటు శరీరంపై తెల్ల మచ్చలు, అజీర్ణం, వాంతులు వంటి ఇతర రకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. అందుకనే ఈ ఆహార పదార్థాలను చికెన్ తో కలిపి తినకూడదు.
చికెన్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే పాలను త్రాగకూడదు. పాలలో ఉండే పోషకాలు దాదాపుగా చికెన్ లో ఉంటాయి. పాలలోని పోషకాలు మరియు చికెన్ లోని పోషకాల కలయిక శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పాలు మరియు చికెన్ కలిపి తినడం వలన శరీరంలో ప్రతి చర్య ఏర్పడుతుంది. దీని మూలంగా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే మనలోచాలామంది పెరుగు లో చికెన్ ను వేసుకొని తింటారు. కానీ చికెన్ తో పెరుగు కలిపి తినకూడదు. నిజానికి చికెన్ తింటే కడుపులో వేడి వస్తుంది. అదే సమయంలో పెరుగు తింటే పొట్ట కూడా చల్లబడుతుంది. రెండు ఆహారాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి జీర్ణక్రియ వ్యవస్థకు హాని కలుగుతుంది.
అలాగే చికెన్ తో చేపలు కలిపి తినకూడదు. ఈ రెండు ఆహారాలలో ప్రోటీన్ ఉంటుంది. ఇలా రెండింటిని కలిపి తీసుకోవడం వలన శరీరంలో అధిక ప్రోటీన్ చేరుతుంది. దీనివలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతిరోజు చికెన్ ను తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాగే చికెన్ ఎక్కువగా ఫ్రై చేసుకుని తినకూడదు. ఇలా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అందుకనే చికెన్ కాల్చినది లేదా ఉడకబెట్టినది తినాలి. అలాగే చికెన్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా తింటే అధిక వేడి వలన ముక్కు నుంచి రక్తం కారవచ్చు. అలాగే చికెన్ ను ఎక్కువగా తింటే శరీరం బరువు పెరుగుతుంది. అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.