Heart Disease : మహిళల్లో మోనోపాజ్ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే… వెంటనే అప్రమత్తం అవ్వండి…!
ప్రధానాంశాలు:
Heart Disease : మహిళల్లో మోనోపాజ్ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే... వెంటనే అప్రమత్తం అవ్వండి...!
Heart Disease : ప్రస్తుత కాలంలో గుండెపోటు సమస్యలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ గుండెపోటు సమస్యలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి అని అధ్యయనాలు తెలిపాయి. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో ఆ జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనేది జగమెరిగిన సత్యం అని చెప్పొచ్చు. ఈ నిర్లక్ష్యం వలన ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళల సంఖ్య పెరిగేలా చేస్తుంది. దీనివలన మహిళల చిన్న వయసులోనే గుండెపోటు అనేది సంభవిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మహిళల మోనోపాజ్ తర్వాత మహిళల్లో గుండెపోటు ప్రమాదం అనేది అధికంగా పెరుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో పురుషులతో పాటుగా స్త్రీలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు…
మహిళలు 45 నుండి 50 ఏళ్ల మధ్య మోనోపాజ్ దశలోకి అడుగు పెడతారు. అయితే ఈ దశలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావం అనేది తగ్గుతుంది. దీంతో శరీరంలో కొవ్వు అనేది పేరుకుపోయి సమస్యలు వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయి. అయితే ఈ మోనోపాజ్ మాత్రమే కాక మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచే ఎన్నో ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి మధుమేహం, అధికరక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రెగ్లిజరైడ్స్, ఉబకాయం లాంటి ఎన్నో శారీరిక పరిస్థితులు కూడా గుండె సమస్యల ప్రమాదాలను పెంచుతాయి. అలాగే మధ్యపానం మరియు దూమపానం లాంటి అలవాట్లు కూడా మహిళల్లో గుండెకు సంబంధించిన ప్రమాదాలను పెంచుతాయి.
నిజం చెప్పాలంటే. పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే ఎంతో మంది మహిళలు ఇంట్లో మరియు బయట తామొక్కరే అన్ని పనులను చేయడం వలన మహిళలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టేందుకు తగిన టైం దొరకదు. అసాధారణ అలసట అనేది గుండె సమస్యలకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అలాగే మహిళల్లో గుండెపోటు లక్షణాలు అసాధారణ అలసట మరియు నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం, కడుపునొప్పి, శ్వాస ఆడకపోవటం, చాతి నొప్పి, ఒత్తిడి, అజీర్ణం,ఎగువ వెన్ను నొప్పి, గొంతు, దవడ నొప్పి లాంటి లక్షణాలు అన్నీ కూడా గుండెపోటుకు సంకేతాలే…