Health Tips : అన్నంలో గంజిని తీసేస్తున్నారా.. దానిలో ఉండే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!!
Health Tips ; చాలామంది అన్నం నుంచి గంజిని తీసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అన్నంతోపాటే గంజి నుంచి అన్నం వండుతూ ఉంటారు. గంజి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా రకాల ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. అలాగే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు.. ఇప్పుడున్న కాలంలో గంజిని తాగడం మానేశారు. ఒకప్పటి ఆహారంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో టెక్నాలజీ పెరగడంతో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండేస్తూ ఉన్నారు. దీంతో గంజి వాడకం చాలా తగ్గిపోయింది. అయితే గ్రామాలలో ఇంకా చాలా చోట్లలో గంజిని తాగుతూ ఉంటారు. నిత్యం గంజిని తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
కొన్నాళ్ల క్రితం మజ్జిగ లేనప్పుడు ఏసవిలో చలవదనం కోసం గంజిని అన్నంతో కలిపి తీసుకునేవాళ్లు గంజిని ఆహారంగా తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అలాగే అందాన్ని మెరుగుపరుస్తాయని చాలామందికి తెలియదు.. అయితే ఈ గంజి వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. నిత్యం తప్పకుండా గంజి తీసుకుంటే శరీరం బలంగా తయారవుతుంది. అలాగే శరీరానికి శక్తి అందేలా చేస్తుంది? కండలు పెరగడానికి శరీరంలోని అమినో ఆమ్లాలు ఉపయోగపడతాయి. గంజిలో కార్బోహైడ్రేట్లు శరీరానికి మరింత శక్తిని ఇస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే చర్మ సౌందర్యానికి ఈ గంజి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ గంజిలో ఒక కాటన్ వాళ్ళ నుంచి శర్మానికి అప్లై చేయడం వలన మొటిమలు అలాగే మొటిమల వలన వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి. ముఖానికి గంజి రాసుకోవడం వలన వయసు పై పడటం వలన వచ్చే ముడతలు తగ్గిపోతాయి. గంజిలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్య ఛాయాల్ని తగ్గిస్తాయి. గంజిని జుట్టు కుదుళ్లకు పెట్టుకోవడం వలన కుదుల నుంచి బలోపేతమై ఆరోగ్యవంతమైన అలాగే ఉత్తర జుట్టు పెరుగుతుంది. ఒకప్పుడు గంజిని షాంపుగా వాడేవాళ్లు గంజిని ఉపయోగించడం వలన జుట్టు పట్టుల మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనుసిటోల్ అనే కార్బోహైడ్రేటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టుకుదులను బలోపేతం చేస్తాయి. లావెండర్ ఆయిల్ని కొద్దిగా గంజిలో కలిపి జుట్టుకు పట్టించి పది నిమిషాలు ఆగాక కడిగిస్తే ఎయిర్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది.
గంజిని హెయిర్ మాస్క్ ఉపయోగించడం వలన పొడవైన ఆరోగ్యమైన అందమైన జుట్టు పెరుగుతుంది. గంజిని నిత్యం తీసుకోవడం వలన గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. గంజిలో బోలెడన్ని ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో మంట రావడానికి తగ్గిస్తుంది. అలాగే మలబద్దక సమస్యను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా శరీరాన్ని అధిక వేడి నుంచి రక్షిస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా రక్షిస్తుంది. ఈ గంజిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఎజింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. పలు శారీరిక సమస్యలకు గంజి గొప్పగా సహాయపడుతుంది. ఇది శరీరానికి కావలసిన శక్తిని అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు శరీరానికి వెంటనే శక్తి అందేలా చేస్తాయి.