Health Tips : దీనిని రోజు ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు… ఒంట్లో అధిక కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..!
Health Tips : ఇప్పుడున్న జనరేషన్లో సరియైనటువంటి శారీరిక శ్రమ లేకపోవడం వలన చాలామంది అధిక బరువు అలాగే ఒంట్లో అధిక కొలెస్ట్రాల్ తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం సరియైనటువంటి ఆహారం అలవాట్లు లేకపోవడం అదేవిధంగా సరియైనటువంటి నిద్ర లేకపోవడం కూడా ఈ ఒబోసిటీ అలాగే అధిక బరువు లాంటి సమస్యలు వస్తున్నాయి. దీనితోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ అధిక బరువు ఉన్నవాళ్లు గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు అధికంగా ఉండడంతో పాటు ఏ పని చేయలేకపోతున్నారు. ప్రతి చిన్న పనికి నీరసం ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది.
ఇటువంటివారు క్రమ పద్ధతిగా తినడం, వ్యాయామం చేయడం అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ బిజీ లైఫ్ లో అందరూ వాటిని పాటించడం చాలా కష్టంగా మారింది. కానీ ఆహారంలో ఇప్పుడు చెప్పబోయే ఒక పౌడర్ ని తీసుకుంటే చాలావరకు నిద్రలోనే అధిక బరువు సమస్య తగ్గిపోతుంది. దీనికోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు నల్ల జీలకర్ర ఇది చూడడానికి గోధుమ రంగులో చాలా పొడవుగా ఉంటుంది. చాలామంది నల్ల జిలకర అనుకొని కలోంజి విత్తనాలు తెచ్చుకుంటున్నారు. కానీ నల్ల జిలకర పొడవుగా ఉంటుంది. తర్వాత అవి గింజలు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి.
ఈ రెండు చెంచాలు అవిస గింజలను రెండు చెంచాల నల్ల జీలకర్ర రెండు నిమిషాల పాటు నూనె లేకుండా వేయించి పౌడర్ వీటిని పౌడర్లా తయారు చేయాలి. తర్వాత దీనిలో ఒక అర చెంచా సైంధవ లవణం కలుపుకోవాలి. ఈ పౌడర్ ను ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకోవడం వలన ఇది శరీరంలో మెటబాలిజం రేటును పెంచడంతోపాటు అధిక కొలెస్ట్రాల్ను కరిగించి బరువు సమస్యను తగ్గిస్తుంది. కాలా జీరాలో విటమిన్ ఏ, సి ,కె ఐరన్ అలాగే పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి జ్ఞాపకశక్తికి పనిచేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఏకాగ్రతని కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. అలాగే ఇది కీళ్ల నొప్పులను మరియు తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
ఇది బరువు తగ్గడానికి అవసరమైన కొవ్వు కట్టర్లు అని పిలుస్తారు.. అయితే ఈ అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే పీచు పదార్థాలకు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కూడా ఉంటుంది. మీరు బరువు తగ్గడం కోసం కేలరీలను తగ్గించినట్లయితే ఇది తినాలని మీ కోరికను అణిచివేయడం సహాయపడుతుంది. అదనంగా మీ జీర్ణవ్యవస్థ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాల ద్వారా ప్రేరేపించబడుతుంది. మీ సహజ ఉప్పును సైంధవ లవణంతో భర్తీ చేయడం వలన చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సైంధవ లవణం అధిక బరువుని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.