Health Tips : గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగించే… చక్కని పరిష్కారం ఇదే…
Health Tips : ప్రస్తుతం చాలామంది గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం ఇలా ఎన్నో కారణాల వలన తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ సమస్యల బారిన పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి మందులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి బాధతో బాధపడేవారు ఫ్రూట్ జ్యూసులు తాగమంటే ఇంకా గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువై మంట వస్తుందని ఆలోచిస్తారు. అసలు ఎటువంటి ఖర్చు లేకుండా అందరికీ సులువుగా లభించే జ్యూస్ ఒకటి ఉంది. అదే కలబంద జ్యూస్. ఇంట్లో దొరికే ఈ కలబందతో పూర్తిగా ప్రాబ్లమ్స్ ని తగ్గించే ప్రయోజనం ఉంది అని పరిశోధనలు చెబుతున్నాయి.
కలబందలో ముఖ్యంగా అలాక్టిన్ అనే కెమికల్ ఉంటుంది. చాలామందికి గ్యాస్ట్రిక్ వలన పొట్ట మొత్తం చాలా ఇరిటేట్ అయి కణాలన్నీ డ్యామేజ్ అవుతాయి. వీటిని సాధారణ స్థితికి తీసుకురావాలంటే కలబంద జ్యూస్ మాత్రమే సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ తాగినప్పుడు ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఇవి పొట్ట అంచులో వెంబడి ఉండే పొరలు త్వరగా రిపేర్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. దాంతోపాటు పొట్ట అంచుల వెంబడి ఉండే జిగురు పొరలు జిగురు బాగా స్రవించేటట్లు చేస్తాయి. యాసిడ్ యొక్క దాడిని తట్టుకోవడానికి ఈ జిగురు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే అమైనో ఆసిడ్స్ కొన్ని హీలింగ్ కి బాగా ఉపయోగపడతాయి.
కలబందలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం మరియు మినరల్స్ పొట్టలో పీహెచ్ రెగ్యులేట్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ కూడా యాక్సెస్ ఆసిడ్స్ ఉత్పత్తి జరగకుండా గ్యాస్ట్రిక్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ రకమైన అలోవెరా జ్యూస్ తాగితే గ్యాస్ట్రైటీస్ సమస్య తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలోవెరా జ్యూస్ లో ఉదయం, సాయంత్రం తీసుకుంటే చాలా మంచిది. ఆహారం తీసుకోవడానికి ముందే ఈ జ్యూస్ ను త్రాగాలి. దీనికోసం అలోవెరా జ్యూస్ తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం కలుపుకొని మిక్సీ పట్టుకొని కొద్దిగా తేనె కలుపుకొని తీసుకుంటే రుచిగా కూడా ఉంటుంది. అందరూ ఎక్కువగా ఇబ్బంది పడే పొట్ట సమస్యల నుంచి ఈ అలోవెరా జ్యూస్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.