Health Tips : నోటి పూత నుంచి ఉపశమనం పొందాలంటే… ఈ చిట్కాలను పాటించండి…
Health Tips : నోటి పూత సమస్య వచ్చిందంటే ఎంతో ఇబ్బంది పడిపోతుంటాం. అయితే ఈ సమస్య పోషకాహార లోపం వలన వస్తుంది. ఈ సమస్య అనేది కొన్నిసార్లు కడుపు శుభ్రం లేకున్నా, శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిన నోటి అల్సర్లు ఇబ్బంది పెడతాయి. అలాగే అధిక ఒత్తిడికి గురవటం, డీహైడ్రేషన్ వంటివన్నీ నోటిపూతకు కారణాలే. ఈ సమస్య వచ్చినప్పుడు తినడం తాగటం కష్టమవుతుంది. అలాగే పెదవుల లోపల హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఏర్పడే పొక్కులు క్రమంగా పుండ్లుగా మారుతాయి. ఇది ఎర్రగా మారి బాగా ఇబ్బంది పడతాయి. అయితే నోరు పూతలకు సరైన చికిత్స అవసరం. లేకపోతే సమస్య మరింత పెద్దగా అవుతుంది.
అయితే నోటి పూత సమస్య వచ్చినప్పుడల్లా డాక్టర్ల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. కొన్నింటి చిట్కాలతో ఈ సమస్యలను తొలగించుకోవచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాలను చంపడంలో సహాయపడుతుంది. ఇందువలన ఇది నోటి అల్సర్ సమస్యకు మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. నోటిపూత మీద నెయ్యి రాస్తే రెండు రోజుల్లో పుండు క్రమంగా తగ్గుతుంది. అలాగే దేశీ నెయ్యిని ఉపయోగించడం వలన నోటి పూత తగ్గుతుంది. నెయ్యి అల్సర్లకు ఇది చాలా మేలు చేస్తుంది. ఇది వాడిన కొద్ది రోజుల్లోనే అల్సర్లు పూర్తిగా నయం అవుతాయి. రాత్రి పడుకునే ముందు నోటి పొక్కులపై నెయ్యి రాసి ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి.
అలాగే నోటిపూత తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీబయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అల్సర్లను దూరం చేస్తాయి. ఇందుకోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నోటి పొక్కులపై మెత్తగా అప్లై చేయాలి. ఇలా చేస్తే నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నోటి అల్సర్ లను నయం చేయడంలో బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు టీ ట్రీ ఆయిల్ లో నోటి పూండ్లపై రాసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.